Karthi: కార్తీ నటించిన ఆ హిట్ మూవీ సీక్వెల్ కి రంగం సిద్ధం..!

Karthi.. ప్రముఖ కోలీవుడ్ హీరో కార్తీ సర్దార్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన కెరీర్లో భారీ విజయాలను సొంతం చేసుకుంటూ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఇదిలా ఉండగా ఖైదీ సినిమాతో పాటు సర్దార్ సినిమాకి సీక్వెల్ కావాలంటూ అభిమానులు చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పటికే ఖైదీ ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ లోకేష్ కనగరాజు అభిమానులతో ప్రకటించారు.. మరోవైపు సర్దార్ 2 కి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు డైరెక్టర్ ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి..

పీఎస్ మిత్ర దర్శకత్వంలో సర్దార్ -2

Karthi: The stage is set for the sequel of that hit movie starring Karthi..!
Karthi: The stage is set for the sequel of that hit movie starring Karthi..!

పీఎస్ మిత్ర దర్శకత్వంలో రూపొందిన సర్దార్ సినిమా తమిళంలోనే కాదు తెలుగులో కూడా విడుదల చేయడంతో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. దీంతో తెలుగు ఆడియన్స్ కూడా కార్తీ అభిమానులుగా మారిపోయారు.. ఇకపోతే ఇప్పుడు సీక్వెల్ ను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే విధంగా డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. అందుకే దాదాపు మూడు నెలల పాటు స్క్రిప్ట్ వర్క్ కూడా జరిగిందని.. దర్శకుడు తాజాగా వెల్లడించారు.. పైగా కజకిస్తాన్, అజర్ బైజాన్ తోపాటు జార్జియా సహా పలు విదేశీ లొకేషన్స్ లో సర్దార్ 2 సినిమాను రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నామని కూడా స్పష్టం చేశారు… అంతేకాదు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సర్దార్ -2 ను చిత్రీకరిస్తున్నామని కచ్చితంగా సినిమా ప్రేక్షకుల మెచ్చే విధంగానే తయారు చేస్తామని తెలిపారు .

సర్దార్ -2 స్క్రిప్ట్ రెడీ ..

ఇకపోతే సర్దార్ -2 స్క్రిప్ట్ రెడీ అయిందని.. అతి త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభిస్తామని మేకర్స్ స్పష్టం చేశారు. అంతేకాదు సీక్వెల్ లో ప్రముఖ బాలీవుడ్ నటుడు విలన్ గా నటించబోతున్నారని.. అలాగే హీరోయిన్ గా ప్రముఖ బ్యూటీ ఆషికా రంగనాత్ ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే పీఎస్ మిత్ర చెన్నైలో భారీ సెట్ నిర్మాణం చేస్తున్నట్లు జూలై మొదటి వారం లేదా చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సర్దార్ సినిమాకి సీక్వెల్ రాబోతోందని తెలిసి అభిమానుల సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమా సక్సెస్ అయితే అటు కార్తీ కి కూడా మంచి ఇమేజ్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

కార్తీ తొలి ప్రయాణం..

కార్తీ విషయానికి వస్తే.. ప్రముఖ కోలీవుడ్ యాక్టర్ శివకుమార్ కొడుకుగా.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.. మొదట మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత పరుతి వీరన్ అనే సినిమా ద్వారా 2007లో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు.. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా ద్వారా ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక తమిళ్లో చేసే సినిమాలను తెలుగులోనూ విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నారు కార్తీ.. మరి ఈసారి సర్దార్ 2 తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకుంటారేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు