Chandu Champion : గుర్తుపట్టలేనంత మారిన బాలీవుడ్ హీరో.. పారాలింపిక్స్ లో మొట్ట మొదటి బయోపిక్..

Chandu Champion : బాలీవుడ్ లో తాజాగా మళ్ళీ బయోపిక్ ల సందడి మొదలైంది. వరుస బెట్టి జీవిత చరిత్రల మీద సినిమాలు, పలు సంఘటనల పై చిత్రాలు వస్తున్నాయి. మొన్నామధ్య వచ్చిన ఫైటర్ పుల్వామా అటాక్ ఘటన ఆధారంగా రాగా, అంతకు ముందు వచ్చిన 12th ఫెయిల్ ఓ ఐపీఎస్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. ఇక రీసెంట్ గా ఓటిటి లో వచ్చి మంచి టాక్ తెచ్చుకున్న “అమర్ సింగ్ చమ్కీలా” ఓ పంజాబీ గాయకుడి లైఫ్ ఆధారంగా తెరకెక్కింది. ఇక ఇప్పుడు మరో క్రేజీ బయోపిక్ తెరపైకి రాబోతుంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ డమ్ కన్నా కంటెంట్ ఉన్న సినిమాలకే ఆడియన్స్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి, అక్కడి హీరోలు సినిమా కోసం ఇప్పుడు ఎలాంటి రిస్క్ అయినా చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్య‌న్ అలాంటి ప‌రివ‌ర్త‌న‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. చాక్లెట్ బోయ్ లా స్మార్ట్ గా క‌నిపించే కార్తీక్ ఇప్పుడు నిజ‌మైన‌ అథ్లెట్ లా మారాడు. అత‌డు త‌న రూపాన్ని పూర్తిగా మార్చేశాడు. ముఖక‌వ‌ళిక‌లు మారాయి, కండ‌రాలు మెలితిరిగాయి. తాజాగా రిలీజ్ చేసిన ఓ ఫస్ట్ లుక్ లో అద్భుతమైన దేహ ధారుడ్యంతో లంగోటి క‌ట్టుకుని ప‌రుగెడుతున్నాడు. అత‌డు అలా ప‌రుగెత్తుతుంటే నిజ‌మైన అథ్లెట్ నే త‌ల‌పిస్తున్నాడు. అయితే ఈ కష్టమంతా ఓ బయోపిక్ చిత్రం కోసమే అని తెలిసింది. సోషల్ మీడియా లో ప్ర‌స్తుతం తాను న‌టిస్తున్న “చందు ఛాంపియన్‌” కోసం ఇంత‌గా శ్ర‌మించాన‌ని కార్తీక్ తెలిపాడు.

ఫస్ట్ లుక్ తోనే ఇంప్రెస్స్..

ఇక తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో ఈ పాత్ర కోసం కఠినమైన వ్యాయామ దినచర్య చేసానని కార్తీక్ చెప్పుకొచ్చాడు. రిలీజ్ చేసిన పోస్టర్ లో కార్తీక్ లంగోటలో ప‌రుగుపెడుతూ టోన్డ్ ఫిజిక్‌ను ప్రదర్శిస్తున్నాడు. ఈ పోస్ట‌ర్ షేర్ చేసిన కార్తీక్ “ఛాంపియన్ ఆ రహా హై” అంటూ కాప్షన్ ఇచ్చి పోస్ట్ చేసాడు. ఇక తన కెరీర్‌లో అత్యంత ఛాలెంజింగ్ రోల్ అని, తన కెరీర్ లో ప్రత్యేకమైన చిత్రం చందు చాంపియ‌న్‌ అని అన్నాడు. ఇక 14 జూన్ న థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. ఇక కార్తీక్ ఫస్ట్ లుక్‌పై పలువురు సెలబ్రిటీలు ప్ర‌శంసాపూర్వ‌కంగా వ్యాఖ్యానించారు. ఇక “చందు ఛాంపియన్” తన కెరీర్‌లో బాగా కష్టపడ్డ చిత్రాలలో ఒకటిగా ఎలా నిలిచిందో కార్తీక్ వెల్ల‌డించాడు. ఈ చిత్రం కోసం తాను శారీరకంగా పరివర్తన చెందానని, ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు సీరియ‌స్ గా మేకోవ‌ర్ కోసం ప్ర‌య‌త్నించాన‌ని చెప్పుకొచ్చాడు. ఒక సంవత్సరం తర్వాత చివరకు స్వీట్ తిన్నాన‌ని, సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు ప్రపంచవ్యాప్తంగా 8 నెలల పగలు – రాత్రి షూట్‌ల‌లో పాల్గొన్నాన‌ని కూడా తెలిపాడు. కార్తీక్ ఆర్యన్ చందు ఛాంపియన్ కోసం 9000 అడుగుల ఎత్తులో థ్రిల్లింగ్ అనిపించే 8 నిమిషాల వార్ సీక్వెన్స్ షూట్లో పాల్గొన్నాడట.

Karthik Aryan's 'Chandu Champion' Movie First Look Released

- Advertisement -

పారాలింపిక్స్ లో ఇండియన్ ఛాంపియన్ కథ..

ఇక ఇప్పుడు తెరకెక్కుతున్న “చందు ఛాంపియన్” (Chandu Champion) కథ ప్రపంచ వ్యాప్తంగా జరిగిన 1970 కామన్వెల్త్ గేమ్స్.., 1972 జర్మనీలో జరిగిన పారాలింపిక్స్‌లో దేశం గర్వించేలా చేసిన బంగారు పతకం సాధించిన విజేత ‘మురళీకాంత్ పేట్కర్’ జీవితం ఆధారంగా రూపొందింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. సాజిద్ నదియాద్వాలా నిర్మాణంలో తెర‌కెక్కించిన ఈ చిత్రం 14 జూన్ 2024న విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో కొత్త నటి భాగ్యశ్రీ, అలాగే ‘ఫర్జీ’ ఫేమ్ భువన్ అరోరా, రాజ్‌పాల్ యాదవ్, విజయ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక త్వరలో బాలీవుడ్ లో మరిన్ని బయోపిక్ చిత్రాలు రానున్నాయని సమాచారం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు