Happy Birthday Karthik Subbaraj : సొంత పంథాను కలిగిన డైరెక్టర్

తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో కార్తీక్ సుబ్బరాజ్ ఒకరు. అయితే కార్తీక్ సుబ్బరాజ్ ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరియర్ ను మొదలుపెట్టాడు. అదే తను దర్శకుడుగా మాత్రం జిగర్తాండ సినిమాతో పరిచయం అవ్వాలని అనుకున్నాడు. కానీ ఆ సినిమా ఎక్కువ బడ్జెట్ కారణంగా మొదట ఆ సినిమాని తెరకెక్కించలేకపోయాడు. చాలా లో బడ్జెట్లో పిజ్జా అనే సినిమాను తెరకెక్కించాడు కార్తీక్ సుబ్బరాజ్.

విద్యా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో కొద్దిపాటి సంచలనాన్ని సృష్టించింది. కార్తీక్ సుబ్బరాజు టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసిన సినిమా ఇది అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత వచ్చిన జిగిర్తండా సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. సినిమాని ఇలా కూడా తీయొచ్చు అని ప్రూవ్ చేశాడు కార్తీక్ సుబ్బరాజు. ఈ సినిమాతో మణిరత్నం శంకర్ లాంటి దిగ్గజ దర్శకుల ప్రశంసలను కూడా పొందుకున్నాడు.

ఇదే సినిమాను గద్దలకొండ గణేష్ గా తెరకెక్కించాడు హరీష్ శంకర్.
ఈ సినిమా వరుణ్ తేజ్ కెరియర్ లో ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలియనిది కాదు. వరుణ్ తేజ్ లోని ఒక సరికొత్త నటుడును బయటకు తీసిన సినిమా ఇది అని చెప్పొచ్చు. ఇకపోతే ఇదే ఒరిజినల్ సినిమాకు నటుడు బాబి సింహకు నేషనల్ అవార్డు కూడా లభించింది. ఈ సినిమా తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ చేసే ప్రతి సినిమా గురించి కూడా ప్రేక్షకులు వెయిట్ చేయడం మొదలుపెట్టారు.

- Advertisement -

జిగతాండ సినిమా తర్వాత ఇరైవి, మెర్క్యూరీ అంటే సినిమాలను తెరకెక్కించాడు కార్తీక్. అయితే కార్తీక్ కు రజనీకాంత్ సినిమా చేసే అవకాశం లభించింది. రజనీకాంత్ హీరోగా రిలీజ్ అయిన పేట సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారు తాను స్వతహాగా ఒక అభిమాని కాబట్టి రజనీకాంత్ ను అలా చూపించి సూపర్ హిట్ సినిమాను రజనీకాంత్ ఖాతాలో వేశాడు.

ఆ తర్వాత కొన్ని సినిమాలను చేశాడు కార్తీక్. వీటిలో జగమే తంత్రం మహాన్ వంటి సినిమాలు మంచి రెస్పాన్స్ సాధించాయి.
మహాన్ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయింది. చియాన్ విక్రమ్, ధ్రువ్ విక్రమ్ కలిసి నటించిన ఈ సినిమా మంచి ఆదరణను సాధించుకుంది. ఇకపోతే శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కథను కూడా కార్తీక్ సుబ్బరాజు అందించాడు.

అయితే అందరిలా కాకుండా కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ డిఫరెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. తీసినవి తక్కువ సినిమాలైనా కూడా వాటిలో కార్తీక్ సుబ్బరాజ్ టాలెంట్ కనిపిస్తుంది. ఇక రీసెంట్ గా జిగర్తాండ డబుల్ ఎక్సెల్ సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకి వచ్చి రీసెంట్ మంచి హిట్ అందుకున్నాడు. ఇలానే మరికొన్ని హిట్ సినిమాలు చేస్తూ కెరియర్ లో ముందుకెళ్లాలని ఫిల్మీఫై తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు