Karthik subbaraj: ఆ స్టార్లతో పని చేస్తే ఏముంది కిక్కు, రజినీకాంత్ సినిమా చేస్తేనే కదా అసలైన కిక్

Karthik subbaraj: తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న సంచలనమైన దర్శకులలో కార్తీక్ సుబ్బరాజు ఒకరు. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత పిజ్జా అనే సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. పిజ్జా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెక్నికల్ గా చాలా బ్రిలియంట్ గా ఆ సినిమాను తెరకెక్కించాడు కార్తీక్ సుబ్బరాజ్. విజయ్ సేతుపతి నటించిన ఆ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయి మంచి ఆదరణను దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన సినిమా జిగర్తాండ.

జిగర్తాండ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా రిలీజ్ అయిన దాదాపు రెండేళ్ల తర్వాత హరీష్ శంకర్ తెలుగులో గద్దల కొండ గణేష్ పేరుతో రీమేక్ చేశాడు. వరుణ్ తేజ్ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ ఫిలిం గా నిలిచిపోయింది. ఒక గ్యాంగ్స్టర్ కి సినిమా దర్శకుడు కి మధ్య జరిగే ప్రయాణాన్ని చాలా ఆసక్తికరంగా డిఫరెంట్ గా చూపించాడు కార్తీక్ సుబ్బరాజు. అయితే కార్తీక్ సుబ్బరాజ్ ఎంత గొప్ప డైరెక్టర్ అని ఇదివరకే ప్రూవ్ అయింది. తనకు నచ్చిన కథలను తనకు నచ్చిన విధంగా చూపించడంలో ఎప్పుడూ కాంప్రమైజ్ కాడు కార్తీక్.

Karthik Subbaraj

- Advertisement -

ఇకపోతే కార్తీక్ సుబ్బరాజు తన కెరీర్ మొత్తంలో పని చేసిన ఏకైక స్టార్ హీరో రజనీకాంత్ మాత్రమే. ఒక సందర్భంలో కార్తీక్ సుబ్బరాజు మాట్లాడుతూ అజిత్ తలపతి విజయ్ తో సినిమా చేయటం అనేది నాకు పెద్ద డీల్ కాదు ఫిలిం మేకర్ గా నచ్చని సినిమా చేయటం అనేది డీల్ అంటూ ఒక సందర్భంలో అన్నాడు. ఇకపోతే రజినీకాంత్ తో ఇదివరకే పెట్టా అనే సినిమాను చేసి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి రజనీకాంత్ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ప్రస్తుతం రజనీకాంత్ వరుస ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలి అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత నెల్సన్ దర్శకత్వంలో జైలర్ టు సినిమాను చేయనున్నారు రజినీకాంత్. ఈ రెండు సినిమాలు తర్వాత మళ్లీ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజినీకాంత్ సినిమా చేసే అవకాశం ఉంది అంటూ తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కెరలు కొడుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు