Bhaje vayu vegam OTT: ఓటీటీలోకి కార్తికేయ భజే వాయువేగం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Bhaje vayu vegam OTT: ఆర్ఎక్స్ 100 సినిమాతో స్టార్ హీరో అయిపోయినా కార్తికేయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ అనంతరం అంతటి రేంజ్ లో ఆయన సినిమాలు చేయలేకపోయాడు. కానీ అంతకు మించిన హిట్ కొట్టాలన్న తపనతో వరుస పెట్టి డిఫరెంట్ కాన్సెప్ట్లతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు కార్తికేయ. ఇక ఇటీవలే బెదురులంక 2012 చిత్రంతో యావరేజ్ టాక్ దక్కించుకున్న కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీనే భజే వాయువేగం.

క్రైమ్ థ్రిల్లర్ జానెర్ లో రూపొందిన ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్ వహించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవితో విడుదల చేయించి ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశారు. భారీ అంచనాల నడుమ మే 31న థియేటర్లలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది ఈ మూవీ. ఇక రిలీజ్ అయినప్పటి నుంచి సినిమాకు మంచి డీసెంట్ టాక్ వస్తుంది. మంచి రెస్పాన్స్ తో ప్రేక్షక ఆదరణ అందుకుంటుంది భజే వాయువేగం.

Bhaje Vayuvegam movie Non Theatrical business details

- Advertisement -

ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను మంచి ధర చెల్లించి నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ మూవీ ఓటిటి విడుదల తేదీ వివరాలు సైతం లీక్ అయ్యాయి. ఈ చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ అనంతరం నెల రోజులకు స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాలు సైతం 20 నుంచి నెల రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి డీసెంట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కూడా నెలలోపే ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు