Karthikeya: పెళ్లి తర్వాత నా లైఫ్ అలా మారిపోయింది.. కార్తికేయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Karthikeya: టాలీవుడ్ హీరోలలో ఒకరైన కార్తికేయ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీకి అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు కార్తికేయ. ఆర్ఎక్స్ 100 మూవీతో స్టార్ హీరో అయిపోయాడు. పాయల్ రాజ్పూత్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ కార్తికేయ కెరీర్ ని పూర్తిగా మార్చేసిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా అనంతరం నుంచి కార్తికేయాకి మంచి అవకాశాలు చుట్టుముట్టాయి.

ఇక ఇదిలా ఉంటే తాజాగా కార్తికేయ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన కార్తికేయ ప్రజెంట్ భజే వాయు వేగం మూవీతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు కార్తికేయ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తికేయ తన దాంపత్య జీవితంపై కామెంట్స్ చేశారు.

Karthikeya interesting comments
Karthikeya interesting comments

” పెళ్లయిన తర్వాత బ్యాలెన్స్ చేయడం వంటివి చాలా సరదాగా ఉంటుంది కదా సినిమాల్లో చూపించినట్లు.. మీరేమో కొంచెం ఎంగేజ్ లోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత మీ లైఫ్ ఎలా మారింది ” అని యాంకర్ ప్రశ్నించగా.. ” నిజానికి పెళ్లయిన తరువాతే నా లైఫ్ చాలా ఈజీగా ఉంది. ఎందుకంటే.. ఇంకా పెద్ద పనేం ఉండదు కదా. పనిచేసామా ఇంటికెళ్లిపోయాం అన్నట్లుగా ఉంటుంది. ముందే రకరకాల యావిగేషన్ వంటివి ఉన్నాయి. పెళ్లికి ముందు ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచించే వాళ్ళం. కానీ పెళ్లి తర్వాత ఇంటికే వెళ్లాలి అనుకుంటాం ” అంటూ చెప్పుకొచ్చాడు కార్తికేయ. ప్రజెంట్ కార్తికేయ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు