Karthikeya : కామెడీ జోనర్ తో..

యువ హీరో కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా సినిమా రూపొందుతోంది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న ‘కలర్ ఫొటో’ తీసిన నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్న తాజా చిత్రమిది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా బెన్నీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ‘బెదురులంక 2012’ టైటిల్ ఖరారు చేశారు. బుధ వారం హీరో కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ను త్వరలోనే విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. బెదురులంక 2012 సినిమా కామెడీ డ్రామాగా వస్తుందని, గోదావరి నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా ఉంటుందని వివరించారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆఖరి షెడ్యూల్ త్వరలో ఉంటుంది. కాగా ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఐదు పాటలను అందించారు. ఈ పాటలు సినిమాకు హైలైట్ గా ఉంటాయని మేకర్స్ నమ్ముతున్నారు.

ఈ సినిమాలో హీరో కార్తికేయ కొత్తగా కనిపిస్తాడని డైరెక్టర్ క్లాక్స్ తెలిపాడు. మనసుకు నచ్చినట్టు జీవించే పాత్రలో హీరో కార్తికేయ కనిపిస్తారు. సొసైటీకి నచ్చినట్లు బతకడం రైటా? మనసుకు నచ్చినట్టు బతకడం రైటా? అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో బెదురులంక 2012 రాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు