Kasturi Shankar : అర్థనగ్న ఫోటోలు వైరల్.. సెన్స్ ఉండక్కర్లా అంటూ కామెంట్..!

Kasthuri Shankar.. బుల్లితెర సీరియల్ నటిగా ప్రేక్షకులకు ఈ మధ్యకాలంలో పెద్దగా పరిచయం చేయకపోయినా.. అలనాటి హీరోయిన్గా మంచి పేరు దక్కించుకుంది. అయితే సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం సందడి చేసి సత్తా చాటిన ఈమె సౌత్ ఇండియా మొత్తంలో చాలా సినిమాలు చేసింది. ఇప్పుడు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి పలు సీరియల్స్ చేస్తోంది. ఇకపోతే కొన్ని కొన్ని సీరియల్స్ లో ప్రధాన పాత్ర పోషిస్తుంటే.. మరికొన్ని సీరియల్స్ లో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ అలరిస్తోంది.. ఇక ఇందులో భాగంగానే ఈమెకు మంచి పేరు తీసుకొచ్చిన సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి.. ఇలా కెరియర్ మొదలు పెట్టినప్పటి నుంచి వరుసగా సినిమాలు సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే డాక్టర్ల వివాహం చేసుకొని అమెరికాకు వెళ్ళిపోయింది..

అర్థనగ్న ఫోటోలు వైరల్.

Kasturi Shankar: Semi N** photos viral.
Kasturi Shankar: Semi N** photos viral.

ఆ తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ సమయంలోనే బిడ్డకు పాలిస్తూ అర్థనగ్నంగా ఫోటోషూట్ చేసింది. ఈ ఫొటోస్ అప్పట్లో తెగ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అంతేకాదు అప్పట్లో ఈమెపై చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కస్తూరి శంకర్ దీనిపై మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది..

ఇండియా కోసం కాదు అమెరికా కోసం అంటూ క్లారిటీ..

కస్తూరి శంకర్ మాట్లాడుతూ.. అసలు నాకు తెలియకుండా.. నా అనుమతి లేకుండా ఇండియాలోని ఒక ప్రముఖ మీడియా కంపెనీ.. సెన్స్ లేకుండా వాటిని దొంగలించి.. పబ్లిష్ చేసింది.. అసలు ఆ ఫోటోషూట్ నేను ఇండియా కోసం చేయలేదు.. అమెరికాలో తల్లి బిడ్డల మాతృత్వం గురించి ఒక మ్యాగజైన్ వారు అడిగితే చేశాను.. అయితే ఇండియాలో వాటిని రిలీజ్ చేయకూడదు.. కానీ కొంతమంది ఆ ఫోటోలను దొంగలించి కనీసం నన్ను సంప్రదించకుండా.. ఇండియాలో లీక్ చేశారు.. మాతృత్వానికి అమెరికా వాళ్ళు ఇచ్చే విలువ చాలా వేరుగా ఉంటుంది. మన వాళ్ళు ఇచ్చే విలువ వేరుగా ఉంటుంది. ఇండియాలో ఇక్కడ పాలు ఇచ్చినా.. ఏదో రకంగా చూస్తారు. అయితే అందరూ అలా ఉండరని తెలుసుకున్నా..ఆ ఫోటో షూట్ చూసిన చాలామంది ఇండియన్ మహిళలు నన్ను ప్రశంసించారు.. ఎందుకంటే వారు కూడా తల్లులే కదా.. ఆ తల్లి విలువ వారికి తెలుసు.. కాబట్టి ఆ తర్వాత పురుషులు కూడా నాకు చాలా మంది సపోర్టుగా నిలిచారు అంటూ చెప్పకు వచ్చింది కస్తూరి శంకర్..ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మాతృత్వానికి ప్రతీక గా నిలిచిన ఈ ఫోటోలను ఇలా దొంగతనం చేసి షేర్ చేయడం చాలా బాధగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది కస్తూరి శంకర్.

- Advertisement -

కస్తూరి శంకర్ సినిమాలు..

కస్తూరి శంకర్ విషయానికి వస్తే నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమాలో రమ్యకృష్ణతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈమె ఆ తర్వాత అడపాదడపా మాత్రమే సినిమాలు చేసింది.. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి విషయంపై స్పందిస్తూ హాట్ టాపిక్ గా మారుతుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే కస్తూరి శంకర్ అర్ధ నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు