Katrina kaif: కత్రినా కైఫ్ కూడా తల్లి కాబోతోందా..?

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న కత్రినా కైఫ్ కి వివాహమైన తర్వాత కాస్త అవకాశాలు తగ్గాయని చెప్పవచ్చు.. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం తగ్గలేదు.. గత కొద్దిరోజులుగా రిలయన్స్ ఇండస్ట్రియల్ అధినేత ముఖేష్ అంబానీ రెండవ కుమారుడు అనంత్ అంబానీ.. ప్రముఖ వ్యాపారవేత్త కూతురు రాధిక మర్చంట్ యొక్క ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ ప్రాంతంలో జామ్ నగర్లో చాలా గ్రాండ్ గా జరిగాయి.. ఇందుకు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఇతరత్రా నటీనటులు , క్రికెటర్స్, సోషల్ మీడియా అధినేతలు , ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఇందులో పాల్గొన్నారు.. మరి ముఖ్యంగా తెలుగు పరిశ్రమ నుంచి రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన కూడా విచ్చేశారు. అంతేకాదు ఈమూడు రోజులపాటు జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి చాలామంది హాజరయ్యారు. వరల్డ్ బెస్ట్ పాప్ సింగర్ రిహాన్నా కూడా తన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. అలాగే సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ , అమీర్ ఖాన్, రామ్ చరణ్ నలుగురు కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఆస్కార్ అవార్డు పొందిన నాటు నాటు పాటకు స్టెప్పులేసి మరి అక్కడికి వచ్చిన అతిథులను ఆనందపరిచారు.

కత్రినా వీడియో వైరల్..
అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సైతం బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరుపొందిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ కూడా పాల్గొన్నారు.. అయితే ఈ వేడుకలో కత్రినా కైఫ్ ఎప్పటికప్పుడు తన పొట్ట భాగం కనబడకుండా కేవలం దుప్పటితో కవర్ చేస్తున్నట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. ముంబైకి తిరిగి వెళ్లే క్రమంలో కూడా తన పొట్ట భాగాన్ని దుప్పటితో కప్పుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది కత్రినా కైఫ్..

కత్రినా బేబీ బంప్ ఫొటోలు..
దీంతో అభిమానులు కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ గా ఉందని అందుకే బేబీ బంప్ ఫోటోలు కనిపించకుండా జాగ్రత్త పడుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు.. వీరిద్దరూ 2021 డిసెంబర్ నెలలో వివాహం చేసుకున్నారు.. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి జరిగి ఇప్పటికీ సుమారుగా రెండేళ్లపైన కావస్తోంది.. కానీ ఇప్పటివరకు ఇంకా గుడ్ న్యూస్ తెలపలేదని అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు..

- Advertisement -

తల్లి కాబోతున్న కత్రినా..
మరి కత్రినా కైఫ్ తల్లి కాబోతోందని వార్తలపై కత్రినా కైఫ్ క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు తెలుపుతున్నారు.. ఇటీవలే బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ కూడా మగ బిడ్డకు జన్మనిచ్చింది..అలాగే స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా తాను తల్లి కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించి అభిమానులను ఖుషి చేసింది.. ఇప్పుడు కత్రినా కైఫ్ , విక్కీ కౌశల్ కూడా మరి అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇస్తారేమో చూడాలి.మొత్తానికైతే కత్రినా కైఫ్ కూడా తల్లి కాబోతోందని అభిమానులు అనుకుంటున్నారు.. మరి ఇదే విషయాన్ని ఆమె కన్ఫామ్ చేస్తే చూడాలని కూడా ఆకాంక్షిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు