Katrina Kaif : కత్రినా ప్రెగ్నెన్సీ పై క్లారిటీ ఇచ్చిన విక్కీ… అయితే నిజమే?

Katrina Kaif : ఓవరాల్‌గా ఈ సంవత్సరం కత్రినా కైఫ్ భర్త, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌కి కెరీర్ మంచి పీక్స్ లో ఉంది. ఒకవైపు ఆయన భార్య కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అని వార్తలు విన్పిస్తుంటే, మరోవైపు ఈ హీరో వరుస సినిమాలను పట్టేస్తున్నాడు. ఆయన తాజా మూవీ బ్యాడ్ న్యూస్ ప్రమోషన్లలో కత్రినా ప్రెగ్నెన్సీ గురించి ప్రస్తావన వచ్చింది. అయితే విక్కీ కౌశల్ ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. మరి కత్రినా ప్రెగ్నెన్సీ రూమర్స్ నిజమేనా? అంటే..

కత్రినా ప్రెగ్నెన్సీ వార్తలపై విక్కీ రియాక్షన్

హిందీ పీరియాడిక్ మూవీ ఛవా, సంజయ్ లీలీ భన్సాలీ నెక్స్ట్ మూవీతో సహా మరికొన్ని ముఖ్యమైన ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టాడు. ఒకవైపు రొమాంటిక్ సినిమాలు చేస్తూనే మరోవైపు కామెడీని కూడా పండిస్తున్నాడు. తాజాగా అలాంటి మరో సినిమానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. అదే ‘బాడ్ న్యూస్’. ఈ మూవీ ట్రైలర్ జూన్ 28న లాంచ్ అయింది. ఈ చిత్రంలో విక్కీ కౌశల్‌తో పాటు త్రిప్తి దిమ్రీ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ సందర్భంగా విక్కీ కౌశల్‌ను అతని వ్యక్తిగత జీవితం గురించి కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. దీనికి ఆయన చెప్పిన సమాధానం సర్వత్రా చర్చనీయాంశమైంది.

Vicky Kaushal Shuts Down Katrina Kaif's Pregnancy Rumours With The Most Epic Response!

- Advertisement -

‘బ్యాడ్ న్యూజ్’ సినిమా ట్రైలర్ లాంచ్ అయినప్పుడు, కొంతమంది రిపోర్టర్లు విక్కీని అతని భార్య, నటి కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ గురించి ప్రశ్నించారు. కత్రినా ప్రెగ్నెన్సీ రుమార్లు నిజమేనా? అని అడిగినప్పుడు, విక్కీ వెకిలిగా నవ్వి సరైన సమయంలో వార్తను ప్రకటిస్తామని చెప్పాడు. ప్రస్తుతానికి, దయచేసి బాడ్ న్యూజ్‌ని ఆస్వాదించండి. సరైన సమయం వచ్చినప్పుడు మేము ప్రెగ్నెన్సీ వార్తలను ప్రకటించడానికి వెనుకాడము అంటూ సమాధానం చెప్పాడు. దీంతో అసలు కత్రినా ప్రెగ్నెంట్ గా ఉన్నట్టా, లేనట్టా అంది సస్పెన్స్ గానే ఉంది. విక్కీ సమాధానం చెప్పిన తీరు చూస్తుంటే ఈ వార్తలు అబద్ధం అన్పిస్తోందని అంటున్నారు ఆమె అభిమానులు. కానీ కొంతమంది మాత్రం సరైన సమయం అంటే బిడ్డ పుట్టాక ప్రకటిస్తారా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. విక్కీ-కత్రినాల వివాహం జరిగి దాదాపు మూడేళ్లు కావస్తోంది. కత్రినా కైఫ్ గర్భవతి అని గత కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్నాయి. విక్కీ-కత్రినా లండన్‌లో వాకింగ్ చేస్తున్నప్పుడు ఫోటోలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా కత్రినా చాలా రోజుల నుంచి మీడియా కంటికి చిక్కకుండా తప్పించుకుంటోంది. మరి ఈ జంట కూడా విరాట్, అనుష్కల లాగా బిడ్డ పుట్టాకే రూమర్స్ ను ఒప్పుకుంటారేమో !

‘బ్యాడ్ న్యూజ్’ విడుదల ఎప్పుడు?

ఆనంద్ తివారీ దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘బ్యాడ్ న్యూస్’ సినిమా రూపొందింది. ఆనంద్ తివారీ దర్శకుడు మాత్రమే కాదు నటుడు కూడా. ఇప్పుడు బ్యాడ్ న్యూజ్ సినిమాకు ఆయన దర్శకుడిగా పని చేస్తున్నారు. బ్యాడ్ న్యూజ్ మూవీ జూలై 19 న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో విక్కీ కౌశల్‌తో పాటు త్రిప్తి డిమ్రీ, అమీ విర్క్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు