Kattapa: రాజమౌళికి రుణపడి ఉంటా.. షాకింగ్ కామెంట్స్ చేసిన సత్యరాజ్..!

తమిళ్, తెలుగు చిత్రాలలో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు నటుడు సత్యరాజ్.. తన కెరియర్లో ప్రతి పాత్రలో కూడా ప్రాణం పెట్టి నటిస్తూ ఉంటారు. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈయన బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రలో నటించి అద్భుతమైన ప్రేక్షక ఆధారణ పొందారు.. ఆ తర్వాత మరిన్ని సినిమాలలో నటించే అవకాశాలు కూడా ఎదురవుతూనే ఉన్నాయి. ప్రభాస్, కట్టప్ప మధ్య జరిగే సన్నివేశాలు కూడా బాహుబలి సినిమాకి భారీ విజయాన్ని తీసుకు వచ్చాయి. అయితే తాజాగా సత్యరాజ్ రాజమౌళి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.. వాటి గురించి చూద్దాం.

మళ్లీ రాజమౌళి మూవీ లో కట్టప్ప..

Kattapa: Sathyaraj who made shocking comments owes to Rajamouli..!
Kattapa: Sathyaraj who made shocking comments owes to Rajamouli..!

ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా అనౌన్స్మెంట్ చేశారు.. ఈ సినిమా కూడా అడ్వెంచర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం మహేష్ బాబు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా రెగ్యులర్ గా మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని నటీనటుల గురించి ఏవో ఒక రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బాహుబలి నటుడు కట్టప్ప కూడా ఇందులో కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కట్టప్ప క్లారిటీ..

దీంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యరాజ్.. మాట్లాడుతూ ఈ విషయం పైన ప్రశ్నించగా..అంతకంటే ముందు రాజమౌళికి తను చాలా రుణపడి ఉన్నానని తెలియజేశారు.. దక్షిణాదిలో అందరూ తనని సత్యరాజ్ గా కంటే కట్టప్ప గానే గుర్తు పడుతున్నారని తెలిపారు. ఇప్పుడు మరొకసారి బాహుబలి యానిమేషన్ సిరీస్ ని విడుదల చేయబోతున్నారు.. దీనివల్ల చిన్నారులు కూడా తనని బాగా గుర్తుపడతారని వెల్లడించారు. బాహుబలి చిత్రంలో తనకి ఎక్కువగా కండలు ఉన్నట్లుగా చూపించారని ఇప్పుడు యానిమేషన్ సిరీస్లో మరింత ఎక్కువగా చూపించారని.. కానీ బయట తను మాత్రం అలా ఉండలేనని తెలియజేశారు..

- Advertisement -

అవకాశం ఇస్తే తప్పక నటిస్తాను..

మహేష్ బాబు సినిమాలో నటించడానికి తనని ఎవరు సంప్రదించలేదని .. ఒకవేళ కచ్చితంగా అవకాశం వస్తే నటించడం జరుగుతుంది అంటూ తేల్చి చెప్పారు. రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమా కూడా చాలా ప్రీ ప్లాన్ తోనే తెరకెక్కిస్తారని.. అందుకే ఆయనకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందని తెలియజేశారు సత్యరాజ్. అలాగే మోదీ బయోపిక్ లో తను నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి.. అలాంటిదేమీ లేదు.. కేవలం ఎవరో ఫోటోలను మార్పింగ్ చేసి అలా సెట్ చేసి విడుదల చేశారని తెలియజేశారు. మొత్తానికి మహేష్, రాజమౌళి కాంబినేషన్ సినిమాల అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తానని తెలియజేశారు సత్యరాజ్.

ఆస్కార్ దిశగా రాజమౌళి అడుగులు..

ప్రస్తుతం మహేష్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న పాన్ వరల్డ్ చిత్రం ఆఫ్రికన్ అడవుల్లో యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కబోతోందని సమాచారం. భారీ అంజనాల మధ్య రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి..మహేష్ బాబు సినిమాతో మరెలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.. ముఖ్యంగా ఆస్కార్ అవార్డు దక్కించుకోవడమే ప్రధాన లక్ష్యంగా దూసుకుపోతున్న రాజమౌళికి ఈ సినిమా ఆస్కార్ అవార్డును అందిస్తుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు