Kavya Kalyanram : కిల్లింగ్ లుక్స్ తో కావ్య.. ఆ చూపుకి అర్ధమేంటో?

Kavya Kalyanram : టాలీవుడ్ లో ఇప్పుడు తెలుగు హీరోయిన్ల హవా బాగానే నడుస్తుంది. రీసెంట్ గా డైరెక్ట్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళే కాదు, ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా రాణించిన వారు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ల క్రితం చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో రాణించిన కావ్య కళ్యాణ్ రామ్ కూడా హీరోయిన్ అయిపొయింది. బాలనటిగా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి క్యూట్ గా ఆకట్టుకున్న కావ్య, ఇప్పుడు హీరోయిన్ గా కూడా వరుస సినిమాలతో తన నటనతో బిజీ అవుతుంది. ఇక మూడేళ్ళ కింద మాసూద అనే చిన్న సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది కావ్య. ఫస్ట్ మూవీతోనే హీరోయిన్ ‏గా అందరినీ మెప్పించింది. ఆ తర్వాత బలగం సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఈ మూవీతో కావ్య కళ్యాణ్ రామ్ కెరీర్ టర్న్ అయిందని చెప్పొచ్చు. టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఒక్కసారిగా తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. ముఖ్యంగా చిన్న సినిమాల్లో ఈ హీరోయిన్ వన్ అఫ్ ది బెస్ట్ ఆప్షన్ అయిపొయింది.

హీరోయిన్ గా వరుస సినిమాలు..

ఇక కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాక బలగం వంటి సక్సెస్ తో వరుస అవకాశాలు అందుకుంటుంది. బలగం సినిమా తర్వాత శ్రీ సింహ ఉస్తాద్ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఓ సెలియా అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ భామ మరో రెండు ప్రాజెక్ట్ లకు కూడా సైన్ చేసిందని సమాచారం. ఇక త్వరలోనే ఓ కన్నడ సినిమాలో కూడా నటించబోతుందని తెలుస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చినపుడు సినిమాలతో ఎలా బిజీ గా ఉందొ, ఇప్పుడు కూడా అలాగే బిజీ అవుతుందని చెప్పొచ్చు. కాకపోతే చేతిలో అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటోంది కావ్య కళ్యాణ్ రామ్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలు పోస్ట్ చేస్తూ పలకరిస్తుంటోంది. ఆడియన్స్ కి ఫుల్ టచ్ లో ఉంటోంది. ఎప్పటికప్పుడు తన సినిమాల గురించి కూడా రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది.

కిల్లింగ్ లుక్స్ తో కావ్య..

ఇక కొన్ని రోజుల కింద ట్రెడిషనల్ వేర్ తో అలరించిన కావ్య ఇప్పుడు ట్రెండీ ఔట్ ఫిట్స్ లో కూడా అందాలు ఆరబోస్తుంటోంది. రకరకాల పోజులు ఇస్తూ అందరినీ ఫిదా చేస్తుంటోంది. తాజాగా కొత్త ఫోటోషూట్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ తెలుగు బ్యూటీ. ట్రెండీ మినీ ఫ్రాక్ లో కనిపిస్తూ గ్లామర్ షో చేస్తోంది. థైస్ షో చేస్తూ అందరినీ ఫ్లాట్ చేస్తూ కిల్లింగ్ లుక్స్ తో మతులు పోగుడుతుంటోంది. కర్లీ హెయిర్ తో ఓ రేంజ్ లో అలరిస్తోంది. ఇక చాలా మంది నెటిజన్లు, ఈ గంగోత్రి పాప నయా ఫొటోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కావ్య కళ్యాణ్ రామ్ ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక కావ్య కళ్యాణ్ రామ్ కి ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో 367K ఫాలోవర్లు ఉండగా నాలుగు లక్షల ఫాలోవర్లకు చేరుకుంటున్నారు. ఇక బలగం కు ముందు ఇందులో సగం ఫాల్లోవర్లు కూడా లేరు. ఇప్పుడు తన సక్సెస్ తో పాటు గ్లామర్ షో తో ఫాలోవర్లను పెంచుకుంటుందని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు