Kavya Thapar : పాటలకే పరిమితమా ఏంటి? ఎక్కడ చూసిన దాని గురించే చెప్తుంది…

Kavya Thapar : రామ్ పోతినేని – పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ ఏ రేంజ్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటు పూరి కి, అటు రామ్ కి సాలిడ్ మాస్ కం బ్యాక్ ఇచ్చింది ఆ సినిమా. రాపో సరికొత్త మాస్ అవతార్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు ఐదేళ్ల తర్వాత దీనికి సీక్వెల్ గా మళ్ళీ “డబుల్ ఇస్మార్ట్” సినిమా తెరకెక్కింది. పైగా ఇప్పుడు పూరి జగన్నాథ్, రామ్ వరుస ప్లాప్ లతో మళ్ళీ కం బ్యాక్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. పైగా ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో డబుల్ ఇస్మార్ట్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా వరంగల్ లో గ్రాండ్ గా జరిగింది.

Kavya Thapar Speech at Double Smart Pre Release Event

కావ్య స్పీచ్ వైరల్..

ఇక డబుల్ ఇస్మార్ట్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ అందరూ వచ్చి సినిమాని ప్రమోట్ చేయగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరి జగన్నాథ్, రామ్ ల స్పీచ్ లు వైరల్ గా మారాయి. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ కావ్య థాపర్ కూడా మాట్లాడింది. కావ్య థాపర్ మాట్లాడుతూ.. “హాయ్ వరంగల్. మీ అందరి ప్రేమకి ధన్యవాదాలు. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఈ జర్నీ చాలా స్పెషల్. ఇందులో జన్నత్ క్యారెక్టర్ ఇచ్చిన పూరిగారికి చాలా థాంక్ యూ… ఛార్మి కేరింగ్ గా చూసుకున్నారు. రామ్ గారితో కలిసిపని చేయడం హానర్. అలాగే మార్ ముంత చోడ్ చింతా, స్టెప్పా మార్ లాంటి పాటలు చేయడం చాలా బ్లెస్సింగ్.. రామ్ అమెజింగ్ పర్సన్ & ఫెంటాస్టిక్ డాన్సర్… అంటూ ఈ సినిమాలో నటించిన అలీ, టెంపర్ వంశీ, గెటప్ శ్రీను అందరికీ థ్యాంక్స్ చెప్పి “మార్ ముంత చోడ్ చింతా” అంటూ ఎనర్జిటిక్ గా తన స్పీచ్ ముగించింది.

- Advertisement -

పాటల కోసమే పెట్టారా ఏంటీ?

అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కావ్య మాట్లాడిన మాటల్లో సినిమా కన్నా పాటల గురించే ఎక్కువ చెప్పినట్టు ఉంది. అలాగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో, ఇంటర్వ్యూలలో ఎక్కడ చూసినా సాంగ్స్ గురించే ఎక్కువగా చెప్తుంది.. అంటే కావ్య ని పాటలకే పరిమితం చేసారా ఏంటి? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇస్మార్ట్ శంకర్ లో నభా నటేష్ పాత్ర కూడా పాటలకే పరిమితం అన్నట్టుగా ఉంటుంది. ఇక డబుల్ ఇస్మార్ట్ లో కావ్యా పాత్ర కూడా అలాగే ఉన్నట్టు ఉంది. మరి సినిమాలో ఈమె రోల్ ఎలా డిజైన్ చేసారో చూడాలి. ఇక ఆగష్టు 15న రిలీజ్ అవుతున్న డబుల్ ఇస్మార్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు