Keedaa Cola: కీడా కోలా బ్రేకీవెన్ ఎంతంటే..!

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి వరుస హిట్స్ అందుకున్న తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తరుణ్ భాస్కర్ తాజాగా కీడా కోలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకోవటంతో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. రిలీజ్ కి ఒక రోజు ముందు వేసిన ప్రీమియర్స్ తో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది ఈ సినిమా.

Read More: Keedaa Cola Movie Review: టాక్ ఎలా ఉందంటే..!

లో బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకి ముందు నుండే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవ్వటంతో మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ గురించి అఫీషియల్ అప్డేట్ లేదు కానీ, 8.5 నుండి 9కోట్ల వరకు జరిగిందని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అంటే, కీడా కోలా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 9కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టాలి.

- Advertisement -

యూఎస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ అవ్వటం పెద్ద విషయం ఏమీ కాదనే చెప్పాలి. సినిమా కథలో కొత్తదనం ఏమీ లేకపోయినా  తరుణ్ తనదైన స్టైల్ యూనిక్ గా డీల్ చేశాడు ఈ సినిమాను. బ్రహ్మానందం ని డిఫరెంట్ రోల్ లో చూపించి సక్సెస్ అయ్యాడు డైరెక్టర్.

Read More: Keedaa Cola: కీడా కోలా ఏ ఓటీటీలో అంటే..!

బ్రహ్మానందం మినహా స్టార్ క్యాస్ట్ లేని ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ ఒక్కడే క్రౌడ్ పుల్లర్ అని చెప్పాలి. డైరెక్షన్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో  ఓ ఇంపార్టెంట్ రోల్ లో కూడా నటించాడు తరుణ్ భాస్కర్. తరుణ్ క్యారెక్టర్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని టాక్ వినిపిస్తోంది. మరి, డీసెంట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఎంత స్పీడ్ గా టార్గెట్ రీచ్ అవుతుందో అన్నది వేచి చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు