Keedaa Cola Movie Review: టాక్ ఎలా ఉందంటే..!

తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో బ్రహ్మానందం, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన కీడా కోలా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కి ఒక రోజు ముందే ప్రీమియర్స్ పడిన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. అక్కడక్కడ కామెడీ సీన్లు మినహా సినిమాలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ ఏమీ లేవని ట్విట్టర్లో టాక్ వినిపిస్తోంది.

Read More: Keedaa Cola Premieres Talk: విషయం వీక్ – పబ్లిసిటీ పీక్స్..!

తరుణ్ ప్రమోషన్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్న ఈ సినిమా ఆడియెన్స్ ని మెప్పించటంలో విఫలమైంది. కథపరంగా కొత్తదనం లేకపోయినా తనదైన యూనిక్ స్టైల్ లో సినిమాను డీల్ చేద్దామనుకున్న తరుణ్ ఎగ్జిక్యూషన్ విషయంలో తడబడ్డట్టు అనిపిస్తుంది. తన క్యారెక్టర్ ని మినహాయిస్తే, మిగతా ఏ క్యారెక్టర్స్ కి పర్ఫామెన్స్ కి పెద్దగా స్కోప్ లేకపోవటం మైనస్ అయ్యింది. ఉన్నంతలో బ్రహ్మానందాన్ని కొత్తగా చూపించటంలో కొంతవరకూ సక్సెస్ అయ్యాడు తరుణ్.

- Advertisement -

వివేక్ సాగర్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నప్పటికీ డైలాగ్స్ వినపడకుండా డామినేట్ చేసింది. కొన్ని డైలాగ్స్, కొన్ని కామెడీ సీన్స్ మినహాయిస్తే సినిమాలో హైలైట్స్ ఏమీ లేవు. టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచిన ఈ సినిమా చివరికి బిలో యావరేజ్ గా నిలుస్తుందని చెప్పాలి.  సాదాసీదా కథను కొత్త తరహా ట్రీట్మెంట్ తో చెప్పాలనుకున్న డైరెక్టర్ ప్రయత్నం విఫలమైందనే చెప్పాలి.

Read More: Keedaa Cola: కీడా కోలా ఏ ఓటీటీలో అంటే..!

లో బడ్జెట్ సినిమా కాబట్టి, రిలీజ్ కి ముందు ఏర్పడిన హైప్ తో బ్రేక్ ఈవెన్ అవ్వటం పెద్ద కష్టం కాకపోవచ్చు కానీ, కంటెంట్ పరంగా ఇది తరుణ్ భాస్కర్ రేంజ్ సినిమా అయితే కాదు. మొత్తంగా మంచి అంచనాలతో రిలీజైన కీడా కోలా ఆశించిన స్థాయిలో అలరించలేదని చెప్పాలి. ఈ సినిమా రిజల్ట్ తో అయినా తరుణ్ యాక్టింగ్ మీద మోజు తగ్గించుకొని పూర్తీ స్థాయిలో డైరెక్షన్ మీద దృష్టి పెడితే బాగుంటుంది.

ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం వేచి ఉండండి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు