Keeravani: తెలంగాణ పాటను ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ చేయడమేంటని సీఎం కి లెటర్ రాసిన మ్యూజిక్ అసోసియేషన్

Keeravani: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎం ఎం కీరవాణి ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు ఎం ఎం కీరవాణి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని కూడా పాడుకోగలిగేలా చేసిన అతి తక్కువ మంది సంగీత దర్శకులను కీరవాణి ఒకరు. ఒక మామూలు సీను కూడా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అద్భుతంగా ఎలివేట్ చేస్తారు కీరవాణి. ఇంకా ఎస్ఎస్ రాజమౌళి సినిమాల్లో కీరవాణి మ్యూజిక్ ఎంతటి కీలక పాత్ర వహిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి కీరవాణి మ్యూజిక్ లేకుంటే రాజమౌళి సినిమాలు చూడలేము అని అనడం కూడా అతిశయోక్తి కాదు. అంతలా ఇంపాక్ట్ చూపిస్తుంది కీరవాణి సంగీతం.

రాజమౌళి సినిమాలకు ప్రత్యేకం

రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తారు. స్టూడెంట్ నెంబర్ వన్ దగ్గర నుంచి రీసెంట్ గా వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా వరకు అన్నిటికీ సంగీతం కీరవాణి అందించారు. కీరవాణి ఎంత మంది దర్శకులతో పనిచేసిన కూడా రాజమౌళి సినిమాల్లో కీరవాణి ఇచ్చే సంగీతం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని చెప్పొచ్చు. ఇకపోతే రీసెంట్గా ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నారు కీరవాణి. తెలుగు సినిమాకి ఆస్కార్ అనేది ఊహల్లో కూడా ఉండేది కాదు అలాంటిది ఆస్కార్ అవార్డును తెలుగులోకి తీసుకొచ్చారు అంటే అది మామూలు విషయం కాదు.

MM Keeravani

- Advertisement -

తెలంగాణ పాట బాధ్యతలు

ఇకపోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ స్టేట్ కోసం ఒక పాటను కంపోజ్ చేయమని కీరవానికి బాధ్యతలు అప్పజెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ చెందిన ఎం ఎం కీరవాణి తెలంగాణ స్టేట్ కోసం పాటను కంపోజ్ చేయడం ఏంటి అని తెలుగు సంగీత అసోసియేషన్ లెటర్ ను రాశారు ఇంతకీ ఆ లెటర్ సారాంశం ఏంటంటే.

అసోసియేషన్ లేఖ

గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులకు వినమ్రముగా తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ (TCMA) వారు తెలియజేయునది.

విషయం: అందెశ్రీ గారు రచించిన ‘జయజయహే తెలంగాణ…’ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా మీరు ప్రకటించి విడుదల చేయబోతున్నందుకు తెలంగాణ ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే తెలంగాణ కళాకారులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు మా తెలంగాణ సినీ మ్యూజిషియస్ అసోసియేషన్ (TCMA) కూడా గర్వపడుతున్న గొప్ప సందర్భం ఇది.

పదేళ్ల క్రితమే గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రజలకు అందిస్తే ఎంతో బాగుండేది. అలా జరగకపోవడం దురదృష్టకరం.

గత ప్రభుత్వం ఈ పాట విషయంలో ఎన్నో తప్పులు చేసింది.

రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఈ పాట ప్రజలకు ఎంతో చేరువైయ్యింది. అలాంటి పాటని గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం.

ఈ పాట కొందరు తెలంగాణ రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో నలిగి నలిగి చచ్చిపోయింది. మళ్ళీ మీ వల్ల పుట్టి పురుడు పోసుకుంటున్న శుభ తరుణమిది. ఈ పాటని బతికిస్తున్నందుకు ధన్యవాదాలు.

అన్నీ బాగానే ఉన్నా ఇంతటి గొప్ప పాటని సంగీత దర్శకులు కీరవాణి గారికి సంగీతాన్ని అందించమని కోరటం చారిత్రక తప్పిదం అవుతుందని మీకు తెలియస్తున్నాము.

తెలంగాణ అస్తిత్వం మీకు తెలియంది కాదు, తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందో మీకు తెలియంది కాదు, మన ఉద్యోగాలు మనకే రావాలి, మన అవకాశాలు మనకే కావాలి అనే నినాదంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సకల జనుల సహకారంతో ఎంతో మంది అమర వీరుల త్యాగ ఫలంగా ఏర్పడింది మన తెలంగాణ రాష్ట్రం.

ఇంతటి ఖ్యాతి గడించిన మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు పాడటమేంటి, అలాగే పక్క రాష్ట్రాల వాళ్ళు ఆ పాటకి సంగీతాన్ని అందించడమేంటి అలా చేయడం అంటే మన తెలంగాణ కళాకారులని అవమానించడమే అవుతుంది. ఇది మీరు గ్రహిస్తారని తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ (TCMA) కళాకారులుగా కోరుతున్నాము.

ఎంతో ప్రతిభావంతులు మన తెలంగాణాలో ఉన్నారు మన తెలంగాణ కళాకారులకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చి తెలంగాణ కళాకారులకి గౌరవాన్ని ఇస్తారని ఆశిస్తున్నాము.

అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని వివాదాలకు దూరంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలంగాణ పిల్లలతో ఒక బృంద గానంగా పాడించి విడుదల చేస్తే… ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అనే గీతంలా గౌరవింపబడుతుందనేది మా అభిప్రాయం. ఇది మా సలహా మాత్రమే ఈ దారిత్రక గీతాన్ని ఒక దారిత్రక తప్పిదంగా చేయకూడదని మిమ్మల్ని కోరుకుంటూ….

తెలంగాణ సినీ మ్యూజిపియస్ అసోసియేషన్ (TCMA)

-జై తెలంగాణ

అంటూ లేఖ రాశారు. దీనిపై సీఎం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు