Keerthi Suresh: మొదటిసారి పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మహానటి.. పెద్ద ముదురే..!

Keerthi Suresh.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టిన ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ కొన్ని చిత్రాలలో నటించింది. ఆ తర్వాత స్టడీస్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ కొంతకాలం ఇండస్ట్రీకి దూరమై మళ్ళీ మలయాళం లో 2013 లో వచ్చిన గీతాంజలి సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది కానీ ఈమెకు బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం 2015లో వచ్చిన ఇదు ఎన్న మాయం. ఈ సినిమా తర్వాత తెలుగులో నేను శైలజ అనే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మొదటి సినిమా తోనే అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత పలు చిత్రాలలో నటించింది. కానీ తెలుగులో ఈమెకు బ్రేక్ ఇచ్చిన చిత్రం మాత్రం మహానటి అని చెప్పాలి. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం మహానటి. ఈ సినిమా మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ లీనమై నటించిందనే చెప్పాలి. అందుకే ఈ పాత్రకు గాను ఈమెకు ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది.

Keerthi Suresh: Mahanati who gave clarity on marriage for the first time.. Big Mudure..!
Keerthi Suresh: Mahanati who gave clarity on marriage for the first time.. Big Mudure..!

హీరోయిన్ గానే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా..

ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ, ఇటీవలే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడిలో అత్యంత కీలకంగా మారిన బుజ్జి వెహికల్ కి కూడా డబ్బింగ్ చెప్పి అందరిని ఆకట్టుకుంది.

రఘు తాత సినిమా ప్రమోషన్స్ లో కీర్తి సురేష్..

ఇక ప్రస్తుతం తాజాగా ఈమె నటిస్తున్న చిత్రం రఘు తాత.. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న కీర్తి సురేష్ గతంలో తన పెళ్లిపై వచ్చిన రూమర్స్ కు స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. గతంలో తన చిన్ననాటి స్నేహితుడిని కీర్తి సురేష్ వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని ప్రమోషన్స్ లో భాగంగా మీడియా మిత్రులు ప్రశ్నించగా కీర్తి సురేష్ సమాధానం ఇచ్చింది.

- Advertisement -

పెళ్లి రూమర్స్ పై స్పందించిన కీర్తి సురేష్..

కీర్తి సురేష్ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా నా వ్యక్తిగత జీవితం పై అలాగే కుటుంబం పై కొన్ని రకాల రూమర్స్ వస్తున్నాయి. వాటిని నేను పట్టించుకోను.. ఎందుకంటే ఒకవేళ నేను వాటిని పట్టించుకొని సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చినా సరే అవి నిజం అనే నమ్ముతారు.. అందుకే అలాంటి రూమర్స్ పై నేను స్పందించను. ముఖ్యంగా నా నటన గురించి, సినిమాల ఎంపిక గురించి ఏవైనా వార్తలు వస్తే మాత్రం వాటిని తప్పకుండా అంగీకరిస్తాను.. వాటి నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటాను. ఇక నా పెళ్లిపై వస్తున్న రూమర్స్ గురించి నేను అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు.. ప్రస్తుతం నా ఫోకస్ అంత సినిమాల పైన పెట్టాను అంటూ తెలిపింది కీర్తి సురేష్. ఎట్టకేలకు తనపై వస్తున్న పెళ్లి రూమర్స్ కి మొదటిసారి స్పందించి క్లారిటీ ఇచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు