Keerthi Suresh: మహారాజా ఇట్స్ జెమ్ ఆఫ్ తమిళ్ సినిమా

Keerthi Suresh: తమిళ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జర్నీ మొదలుపెట్టిన విజయ్ సేతుపతి పిజ్జా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వరుసగా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేయడంతో మంచి గుర్తింపును పొందాడు. కేవలం తమిళ్లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి నటించిన 50వ సినిమా మహారాజా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1915 స్క్రీన్‌లలో విడుదలైంది. దీనికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

మహానటి కీర్తి సురేష్ సినిమా చూసిన తర్వాత తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆమె మహారాజాను విజయ్ సేతుపతికి సరైన 50వ చిత్రం అని చెప్పుకొచ్చింది. మరియు దర్శకుడు నితిలన్ స్వామినాథన్‌ను షో యొక్క స్టార్ అని ప్రశంసలు కురిపించారు. ఇటువంటి జెమ్ తమిళ్ సినిమాకి యాడ్ అవ్వడం ప్రైడ్ అంటూ చెప్పుకొచ్చింది. అలానే ఈ సినిమాకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవరీ వర్క్ ను ప్రశంసించి ట్విట్టర్ వేదిక ట్వీట్ వేసింది.

Maharaja

- Advertisement -

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే

మహారాజా (విజయ్ సేతుపతి) నెమ్మది స్వభావంతో ఉండే ఓ బార్బర్. ఓ ప్రమాదంలో భార్య కోల్పోవడంతో, ఊరికి దూరంగా ఓ ఇంట్లో కూతురితో ఉంటాడు. ఉదయం బార్బర్ షాప్ కి వెళ్లి రాత్రి 10 గంటల వరకు ఇంటికి రావడం. ఇదే రెగ్యులర్ దినచర్య. తన కూతురు స్పోర్ట్స్ కోసం వేరే విలేజ్ కి వెళ్లిన సమయంలో మహారాజా ఇంట్లో దొంగలు పడి.. అతన్ని బాగా కొట్టి, ఇంట్లో ఉన్న లక్ష్మీ (చెత్త బుట్ట)ను ఎత్తుకెళ్తారు. దీంతో ఆ చెత్తబుట్టను వెతికి పెట్టాలని పోలీసులకు కంప్లైట్ చేస్తాడు..? అందు కోసం పోలీసులకు లక్షల్లో డబ్బులు కూడా ఇస్తాడు..? చెత్త బుట్ట కోసం మహారాజా ఎందుకు అంత ఖర్చు చేశాడు..? అసలు ఇంట్లో దొంగలు ఎందుకు పడ్డారు..? ఆ చెత్త బుట్టనే ఎందుకు ఎత్తుకెళ్లారు..? అనే విషయాలు తెలుసుకోవాలంటే…? ఈ సినిమాను చూడాల్సిందే.

ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్ మరియు నట్టితో సహా చాలామంది స్టార్ కాస్ట్ నటించారు. అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చారు. మహారాజా సినిమాను ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ మరియు థింక్ స్టూడియోస్ నిర్మించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు