Keerthy Suresh: శారీలో సెగలు రేపుతున్న కీర్తి సురేష్.. హద్దులు చెరిపి మరి !

Keerthy Suresh: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోయిన్లు అందరిలో కీర్తి సురేష్ ఒకరు. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అతి చిన్న వయసులోనే సినిమాల్లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళ పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. ఆ తర్వాత తన చదువును పూర్తి చేసుకుని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. ఇక సినిమాల మీద ఉన్న ఆసక్తితో హీరోయిన్గా మలయాళ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత ఈ బ్యూటీ తమిళ, తెలుగు సినిమాల్లో కూడా నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన నటన, అందంతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన జతకట్టి మంచి సినిమా అవకాశాలను అందుకుంటుంది. ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు చేయకుండా కేవలం తన నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే చేసుకుంటూ పోతోంది. ఇక ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది. ఎప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే కీర్తి సురేష్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.

- Advertisement -

వరుస ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈమధ్య కీర్తి సురేష్ గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా సురేష్ గ్రీన్ కలర్ సారీలో మెరిసింది. లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి చాలా అందంగా కనిపించింది. ఈ చీరలో కీర్తి సురేష్ చాలా సాంప్రదాయంగా కనిపించి తన అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు