Keerthy Suresh: ఆ హీరో అంటే పిచ్చి

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నేను శైలజ సినిమాతో మొదటిసారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మహానటి సినిమాతో ఓవర్ నైట్ లోనే మహానటిగా పాపులారిటీని దక్కించుకుంది. మహానటి సినిమాలో తన నటనకు గాను నేషనల్ అవార్డుని సైతం అందుకుంది.

ఇక ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “దసరా” మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ మార్చి 30న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ముంబైలో ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న కీర్తి సురేష్..

అక్కడ ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. మీరు బాలీవుడ్ లో నటిస్తారా? అని అడిగిన ప్రశ్నకు తనకు నటించాలని ఉందని చెప్పింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరో పై తన ప్రేమను బయటపెట్టింది. బాలీవుడ్ లో మీ అభిమాన హీరో ఎవరు అని అడగగా.. క్షణం కూడా ఆలోచించకుండా షారుక్ ఖాన్ అని ఆన్సర్ ఇచ్చింది. అంతేకాదు షారుక్ అంటే పిచ్చి ఇష్టమని.. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోనని తెలిపింది. మరి షారుక్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం మన మహానటికి వస్తుందో లేదో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు