Market Mahalakshmi : కేరింత హీరో కొత్త సినిమా.. సక్సెస్ అవుతాడా?

టాలీవుడ్ లో ఒక్క సినిమాతో ఫేమ్ సంపాదించి ఆ తరువాత వరుస సినిమాలు చేసినా హిట్ లేక కనుమరుగైన హీరోల్లో పార్వతీశం ఒకరు. ఈ పేరు చెప్తే ఎవ్వరూ గుర్తుపట్టలేరు కానీ, కేరింత మూవీ లో సికాకుళం కుర్రోడు అంటే ఇట్టే చెప్పేస్తారు. అయితే ఈ సినిమా తర్వాత ఈ హీరో పలు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడు హీరోగా ఒక కొత్త సినిమాతో వస్తున్నాడు. పార్వతీశం హీరోగా అలాగే కొత్త హీరోయిన్ ప్రణీ కాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, బి2పి స్టూడియోస్ బ్యానర్ లో అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ట్రైలర్ రొటీన్ గానే ఇంట్రస్టింగ్ గా..

తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. మార్కెట్ మహాలక్ష్మి” ట్రైలర్ ని గమనిస్తే ఒక తండ్రి తన కొడుక్కి కట్నం కోసమే పెళ్లి చేయాలనుకోవడంతో మొదలవుతుంది. ఆ తర్వాత హీరో తండ్రి కొడుకుకి ప్రపోజల్స్ తీసుకురావడం, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన పార్వతీశం వాటిని తిరస్కరించగా, ఈ క్రమంలో ఓ రోజు మార్కెట్లో మహాలక్ష్మి నీ చూసి ప్రేమలో పడతాడు హీరో. తనని ఇంప్రెస్ చేయడానికి హీరో పడ్డ అవస్థలు, కష్టాలతో చివరికి వీరేలా కలిశారన్నదే సినిమా కథని తెలుస్తుంది. అయితే ట్రైలర్ చూడ్డానికి రొటీన్ గా ఉన్నా, కామెడీ తో అలరించే అవకాశం ఉంది. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు విజువల్స్ డీసెంట్ గా ఉన్నాయి. ఇక ఈ మార్కెట్ మహా లక్ష్మి చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ కీలక పాత్రల్లో నటించారు.

- Advertisement -

ఇక పార్వతీశం గురించి..

పార్వతీశం కేరింత సినిమా తో శ్రీకాకుళం యాసలో మాట్లాడి ఫేమస్ అయ్యాడు. అయితే అప్పట్లో శ్రీకాకుళం వాళ్ళని కించపరిచారంటూ వివాదాలకు కూడా దారితీసింది. కానీ మూవీ అయితే హిట్ అయింది. ఇక కేరింత సినిమా తర్వాత నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్, రోజులు మారాయి, జగన్నాటకం వంటి సినిమాల్లో సెకండ్ హీరో గా నటించాడు. అయితే ఆ సినిమాలు అంతగా ఆడకపోగా ఈ నటుడికి సరైన బ్రేక్ రాలేదు. ఇక ఇప్పుడు సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మరి మార్కెట్ లో మహాలక్ష్మి తో సక్సెస్ అవుతాడా లేదా అనేది చూడాలి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు మేకర్స్. మార్చి మూడో వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో థియేటర్లలో తీసుకోవచ్చే అవకాశం ఉంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు