Ketika Sharma: హిట్లు లేవు, ఆఫర్లు లేవు అందుకే ఇంత బోల్డ్ గా?

ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేతిక శర్మ. ఢిల్లీ కి చెందిన ఈ రొమాంటిక్ బ్యూటీ ఫస్ట్ సినిమాతోనే బోల్డ్ సీన్లలో నటించి యూత్ ని అట్ట్రాక్ట్ చేసింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయింది. అయినా ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత తో టాలీవుడ్ మేకర్స్ ఇంప్రెస్ అవడంతో ఆఫర్లు అందుకుంది.

ఈ సినిమా తర్వాత నాగశౌర్య నటించిన లక్ష్య సినిమాలో నటించి మెప్పించింది. అయితే ఆ సినిమాకూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా వెనక్కి తగ్గకుండా ఇతర ఇండస్ట్రీల వైపు చూడకుండా టాలీవుడ్ నే నమ్మింది. అప్పుడే వైష్ణవ్ తేజ్ సినిమాలో ఛాన్సొచ్చింది. 2022 లో “రంగ రంగ వైభవంగా” అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ భామ. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సినిమా కూడా తనకు హిట్ తేలేకపోయింది. ఫలితంగా టాలీవుడ్ లో ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ని మూటగట్టుకుంది.

ఇప్పుడు కేతిక శర్మ కు తెలుగులో ఏ ఆఫర్లు లేవు. ప్రస్తుతం ఖాళీగానే ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఇప్ప్పటికప్పుడు యాక్టీవ్ గానే ఉంటుంది. రీసెంట్ గా ఇన్స్టా గ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫోటోలు సెగలు పుట్టిస్తున్నాయి. తన గ్లామర్ షోతో యూత్ ని ఇంప్రెస్ చేసిన ఈ బ్యూటీ డైరెక్టర్లను కూడా తన గ్లామర్ షోతో మెప్పించి ఛాన్సులు రాబట్టుకోవాలని చూస్తుంది ఈ ఢిల్లీ సుందరి. మరి ఏ డైరెక్టర్ చేతిలో కేతిక శర్మ భవిష్యత్తు రాసి ఉందొ, ఏ హీరో వల్ల హిట్ వస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు