KGF Re Release : థియేటర్లలో రాకీ భాయ్.. ఏంటి సడన్ షాక్!

KGF Re Release : టాలీవుడ్ లో దాదాపు మూడు నెలలుగా సరైన సినిమా కూడా రావడం లేదన్న సంగతి తెల్సిందే. అప్పుడెప్పుడో వచ్చిన టిల్లు స్క్వేర్ తర్వాత మళ్ళీ ఒక్క బ్లాక్ బస్టర్ కూడా పడలేదు. మధ్యలో ప్రేమలు, మంజుమ్మేల్ బాయ్స్, రీసెంట్ గా మహారాజ వంటి హిట్ సినిమాలు వచ్చినా అవి డబ్బింగ్ సినిమాలు కావడం గమనార్హం. కానీ తెలుగు సినిమాల పరంగా చూసుకుంటే ఒక్క స్టైట్ సినిమా క్లీన్ హిట్ ని నమోదు చేయలేదు. ఇక రెండు వారాల కింద వచ్చిన శర్వానంద్ మనమే సినిమా ఓ మోస్తరు వసూళ్లతో లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ కాబోతుంది. కానీ మరీ సూపర్ హిట్ సినిమా ఏం కాదు అది. ఇక మధ్యలో ఇక ఈ మధ్య గ్యాంగ్స్ అఫ్ గోదావరి, హరోంహర వంటి చిన్న సినిమాలు భారీ అంచనాలతో వచ్చి బోల్తాపడ్డాయి. ఏది ఏమైనా కల్కి2898AD వచ్చేదాకా తెలుగు సినీ అభిమానుల ఆకలి తీరేలా లేదు. మరో వారం రోజుల్లో ఆ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ వారం పెద్దగా బజ్ ఉన్న సినిమా ఏది రిలీజ్ కాలేదు. అన్నీ చిన్న సినిమాలే కాగా, ఒక్కటీ హిట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. ఇదిలా అనగా ఓ బ్లాక్ బస్టర్ మూవీ సడన్ గా థియేటర్లలో రీ రిలీజ్ అయి షాకిచ్చింది.

KGF Movie Re Released Today in telugu states

థియేటర్లలో కెజిఎఫ్ రీ రిలీజ్.. ఈ సడన్ షాక్ ఏంటి?

క తెలుగు రాష్ట్రాలలో ఈ వారం అరడజన్లు స్ట్రెయిట్ చిన్న సినిమాలు రీ రిలీజ్ కావడం జరిగింది. ఈ సినిమాలు కాకుండా మరో రెండు సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి సుధీర్ బాబు నటించిన ప్రేమకథా చిత్రం కాగా, మరొకటి కన్నడ స్టార్ ఉపేంద్ర నటించిన ‘A’ మూవీ. అయితే సడన్ గా మరో సినిమా థియేటర్ల లో రీ రిలీజ్ అయి షాకిచ్చింది. ఆ సినిమా ఏదో కాదు. కన్నడ నేల నుండి వచ్చి వరల్డ్ వైడ్ గా ప్రకంపనలు సృష్టించిన ‘కెజిఎఫ్’ (KGF Re Release) సినిమా. రాక్ స్టార్ యాష్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఆరేళ్ళ కింద వచ్చిన ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింపుల్ గా చెప్పాలంటే కన్నడ ఇండస్ట్రీతో పాటు, ఇండియన్ సినిమా రేంజ్ పెంచిన సినిమాల్లో ఇదొకటి. అలాంటి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లలో నేడు (జూన్21) న చడీ చప్పుడు లేకుండా రీ రిలీజ్ అయింది. దీంతో పాటు రీ రిలీజ్ అయిన ప్రేమకథా చిత్రం, A సినిమాలకి సంబంధించి వారం ముందే మేకర్స్ అనౌన్స్ చేసి రిలీజ్ చేసారు. కానీ రాకీ భాయ్ మాత్రం సైలెంట్ గా థియేటర్లలో వచ్చేసాడు.

- Advertisement -

స్ట్రెయిట్ సినిమాల కన్నా రీ రిలీజ్ సినిమాలు బెటర్?

అయితే టాలీవుడ్ లో వారం హనీమూన్ ఎక్స్ప్రెస్, నింద, ఓ మంచి ఘోస్ట్, సీత కల్యాణ వైభోగమే, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సందేహం, ఇట్లు మీ సినిమా వంటి చిన్న సినిమాలు రిలీజ్ కాగా ఒక్క దానికి సరైన హైప్ లేదు. దానికంటే రీ రిలీజ్ లు చేసుకోవడం ఉత్తమం అని అనుకున్నారేమో బయ్యర్లు. అందుకే కెజిఎఫ్ సహా ఒకేసారి మూడు సినిమాలు రీ రిలీజ్ చేసారు. మరి ఈ వారం థియేటర్లలో ఏ సినిమా బాగా సందడి చేస్తుందో చూడాలి. ఇక వచ్చేవారం కల్కి2898AD సినిమాపైనే చాలామంది మూవీ లవర్స్ ఫోకస్ ఉంది. సిటీ ఏరియాలో సుదర్శన్ వంటి ప్రతిష్టాత్మక థియేటర్లలో కెజిఎఫ్ సందడి చేస్తుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు