KhadgamReRelease : మురారి ఊపులో ఈ సినిమాని కూడా తెస్తున్నారు.. కానీ ఈ టైం లో పట్టించుకోరు?

KhadgamReRelease : టాలీవుడ్ లో నెల రోజుల కింద రీ రిలీజ్ హడావిడి తగ్గిపోయిందని అందరూ అనుకున్నారు. మొన్నామధ్య రీ రిలీజ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అండర్ పెర్ఫార్మన్స్ చేసాయి. కానీ సరిగ్గా నాలుగు వారాల కింద మళ్ళీ రీ రిలీజ్ సినిమాల సందడి మళ్ళీ మొదలైంది. అది కూడా ఒక క్లాస్ సినిమాతో. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “మురారి” (Murari4k) సినిమా తన బర్త్ డే స్పెషల్ గా ఆగష్టు 9న థియేటర్లలో రీ రిలీజ్ అయి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. రీ రిలీజ్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే ఊపులో చిరంజీవి ఇంద్ర, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ (Gabbarsngh4k) కూడా రీ రిలీజ్ లో మళ్ళీ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

Khadgam Movie ReRelasing On October 2

మురారి ఊపులో మరో క్లాసిక్ ని తెస్తున్నారు…

అయితే ఇప్పుడు ఇదే విధంగా మురారి సినిమా బాగా ఆడిందనే ఊపులో మరో క్లాసిక్ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. అది కూడా కృష్ణవంశీ (Krishnavamshi) సినిమానే కావడం విశేషం. కృష్ణవంశీ దర్సకత్వంలో టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో “ఖడ్గం” (KhadgamReRelease) అనే సినిమా తెరకెక్కి ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఇప్పటికీ స్వాతంత్య్ర దినోత్సవం నాడు, టెలివిజన్ లో తప్పకుండా ఈ సినిమా వేయడం ఆనవాయితీ. కృష్ణవంశీ అద్భుతమైన దర్శకత్వ ప్రతిభతో ఈ సినిమాని దేశభక్తి చిత్రంగా తీర్చి దిద్దాడు. అయితే ఇప్పుడు ఖడ్గం సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతుంది. మురారి రీ రిలీజ్ రెస్పాన్స్ ని చూసే ఈ సినిమాని కూడా రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తూనే ఉంది.

- Advertisement -

ఇది కరెక్ట్ టైం కాదు.. అసలు పట్టించుకుంటరా?

అయితే ఖడ్గం సినిమాని అక్టోబర్ 2న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. కానీ ఇది కరెక్ట్ టైం కాదని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. ఖడ్గం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని రీ రిలీజ్ చేయడం బాగుంది కానీ, దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని స్వాతంత్య్ర దినోత్సవం నాడైన ఆగష్టు 15న లేదా, గణతంత్ర దినోత్సవం నాడైన జనవరి 26న రిలీజ్ చేయాలి కానీ, ఇలాంటి అన్ సీజన్లో రిలీజ్ చేస్తే ఎవ్వరూ పట్టించుకోరని మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆరోజు గాంధీ జయంతి కావచ్చు, కానీ స్వాతంత్య దినోత్సవం నాడు రిలీజ్ చేస్తే ఖడ్గం సినిమాకు ఖచ్చితంగా ఓ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఏది ఏమైనా మురారి సినిమా ఊపులోనే ఈ సినిమాని కూడా రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తూనే ఉంది. మరి రిలీజ్ టైం నాటికి డేట్ మార్చుకుంటారా? లేక అక్టోబర్ 2నే తీసుకొస్తారా అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు