Khushboo: కన్న తండ్రే కాల యముడు అయ్యాడు.. హేమా కమిటీపై స్పందన.!

Khushboo..మలయాళ సినీ ఇండస్ట్రీలో ఆడవారు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు అన్న విషయంపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక.. ప్రస్తుతం అన్ని భాష ఇండస్ట్రీలలో ప్రకంపనలు సృష్టించేలా కనిపిస్తోంది. ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత చాలామంది సెలబ్రిటీలు తమ జీవితంలో వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఒక్కొక్కటిగా మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా మలయాళ సినీ పరిశ్రమలో మాత్రం నటీమణులపైన లైంగిక వేధింపులు , పని దోపిడీతో చాలామంది మహిళలను హింసించారని , లైంగికంగా వేధించారని ఇప్పటికే చాలామంది స్టార్ నటుల పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. చాలామంది పైన పోలీస్ కేసు కూడా నమోదు చేయించినట్లుగా తెలుస్తోంది. వీటితో AMMA సభ్యత్వానికి చాలా నుండి సభ్యులు రాజీనామా చేయడమే కాకుండా తాజాగా మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ కూడా రాజీనామా చేశారు.

Khushboo: Father behaved badly.. Hema's response to the committee.!
Khushboo: Father behaved badly.. Hema’s response to the committee.!

హేమా కమిటీ రిపోర్టుపై స్పందించిన ఖుష్బూ..

ఇప్పుడు తాజాగా హేమా కమిటీ రిపోర్ట్ పైన సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ ప్రశంసలు కురిపిస్తూ ఇలా రాసుకొచ్చింది. హీరోయిన్ ఖుష్బూ తన సోషల్ మీడియా ఖాతాలో పని దోపిడి, లైంగిక వేధింపులు.. ఆడపిల్లలను దోచుకోవడం వంటివి చాలా చోట్ల జరుగుతున్నాయి. దీన్ని స్త్రీలు ఒంటరిగానే ఎదుర్కోవాలి. బాధితులకు కూడా మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి. అలాంటి వారి యొక్క బాధను మనం వినాలి. మానసికంగా వారికి భరోసానివ్వాలి .అప్పుడే ఎలాంటి సమస్య అయినా సరే వారు ఎదుర్కొని ప్రశ్నించగలరు అంటూ తెలిపింది”.

రక్షించాల్సిన వాడే కాల యముడు అయ్యారు..

ముఖ్యంగా తన తండ్రి వేధింపుల విషయం గురించి చెప్పినప్పుడు.. ఇన్ని రోజులు ఈ విషయాన్ని చెప్పడానికి ఎందుకు అంత సమయం తీసుకున్నారని తనని చాలామంది అడిగేవారని, కానీ ఇది వాస్తవమే.. తాను ముందే మాట్లాడాల్సింది.. తనను రక్షించాల్సిన వ్యక్తి ఇలా వేధింపులకు గురి చేశారని, తన తండ్రి తన పాలిట కాల యముడు అయ్యాడు అంటూ బాధపడింది కుష్బూ. నిజానికి మహిళలు తమ కుటుంబంలో నుంచి ఇలాంటి విషయాలు బయట పెట్టడానికి సరైన మద్దతు లేదని, పల్లెల నుంచి చాలామంది అమ్మాయిలు చాలా ఆశలతో ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు. కానీ కొంతమంది దుర్మార్గులు వారి కోరికలను అదుపులో పెట్టుకోలేక వారి ఆశలను వీరి మీద చూపిస్తూ ఉంటారని ఫైర్ అయ్యింది.

- Advertisement -

పురుషులు సైతం స్పందించాలి..

పురుషులకు సైతం తాను చెప్పేది ఒకటే.. మహిళల పైన జరుగుతున్న ఇలాంటి సంఘటనలను మీరు కూడా స్పందించాల్సి ఉంటుంది. మీ ప్రేమ మద్దతు అందరికీ తెలియజేయండి. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి అని తెలిపింది. ప్రతి ఒక్కరూ కలిస్తేనే ఇలాంటి గాయాలు మానేలా చేయగలమని.. జస్టిస్ హేమ కమిటీ వల్ల మార్పు కలుగుతుందని ఆశిస్తున్నాను అంటూ ఖుష్బూ సోషల్ మీడియా ద్వారా ఒక వార్తను తెలియజేసింది. మొత్తానికైతే జస్టిస్ హేమ కమిటీ పైన ప్రతి ఒక్కరూ స్పందించి ఆడవారికి న్యాయం కలిగేలా చేయాలని కోరింది. ఖుష్బూ ఒక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు