Khushi Kapoor: తల్లి బాటలో కూతురు పయనం.. ఆ పార్ట్ కి సర్జరీ.!

Khushi Kapoor.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ఖుషీ కపూర్ అంటే పెద్దగా గుర్తుపట్టక పోవచ్చు.. కానీ దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. శ్రీదేవి కూతుర్లుగా ఇండస్ట్రీలోకి వచ్చిన జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఈమధ్య వరుస ఆఫర్లు అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. కానీ అక్క రేంజ్ లో ఖుషీ కపూర్ పాపులారిటీ సంపాదించుకోలేదని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా ఖుషీ కపూర్ కి సంబంధించిన ఒక వార్త తెరపైకి వచ్చింది. ఈమె తల్లి బాటలోనే ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Khushi Kapoor: Daughter's journey in mother's path.. Surgery for that part.!
Khushi Kapoor: Daughter’s journey in mother’s path.. Surgery for that part.!

తల్లి బాటలో ఖుషీ కపూర్..

ప్రముఖ దివంగత నటి శ్రీదేవి అందంగా ఉండడానికి ఏకంగా 29 సర్జరీలు చేయించుకుంది. డైట్ లో భాగంగా ఆహారానికి బదులు పిల్స్ తీసుకొని అందాన్ని మెయింటైన్ చేసింది. ఇప్పుడు ఆమె బాటలోని ఆమె చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా నడుస్తోందనే వార్త వైరల్ అవుతోంది. అసలు విషయంలోకి వెళితే.. ఖుషీ కపూర్ తన పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అంటూ వార్తలు రాగా.. దీనిపై స్పందించిన ఖుషీ కపూర్ నిజమే అంటూ ఒప్పుకుంది. పాత వీడియోని ప్రదర్శిస్తూ దానిపై ఆరా తీసిన నెటిజెన్ తో ఇన్స్టాలో ఆమె తన పెదాలకు లిప్ ఫిల్లర్ చేయించుకున్నట్లు తెలిపింది. ఖుషీ తన సినిమా అరంగేట్రం చేయడానికి అంటే ముందే ముక్కు అలాగే పెదవులకు శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు తెలిపింది. ఈ వీడియోలో ఖుషి తన తల్లి శ్రీదేవితో కలిసి ఒక ఈవెంట్ కి హాజరైంది. అప్పటికి ఆమె చాలా చిన్న పిల్ల.. కానీ ఇప్పుడు టీనేజ్ కి వచ్చేసింది తన మొదటి ఓటీటీ చిత్రం ది ఆర్చీస్. ప్రీమియర్ షో తో ఎంట్రీ ఇచ్చిన సమయంలో తీసిన వీడియో అది . ఖుషి పాత రూపం గురించి ఒక నెటిజన్ ప్రశ్నించగా వెంటనే స్పందించిన ఖుషీ.. ఈ ప్రక్రియ నిజమే అంటూ ధృవీకరించింది.

ఖుషీ కపూర్ నిజాయితీకి ప్రశంసలు..

అంతేకాదు ఒక సింపుల్ ఏమోజీ తో అది నిజమేనంటూ ఖుషీ కపూర్ చాలా సింపుల్ గా అంగీకరించడంతో ఆ నెటిజెన్ షాక్ అయ్యారు. అంతేకాదు ఖుషీ నిజాయితీని చాలామంది మెచ్చుకుంటున్నారు కూడా. అయితే ఒక నెటిజన్ ఆమె నిజాయితీని ప్రశంసిస్తూ.. మీరు ఇలా నిజాయితీగా చెప్పేయడం వల్ల మీరు ఇంకా నచ్చేస్తున్నారు. ఇది మీ ఎంపిక ..ఆ విషయంలో మీరు అబద్ధాలు చెప్పలేదు.. అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు మొత్తానికైతే సర్జరీ చేయించుకున్నట్టు ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నప్పుడు దానిని తిరస్కరించడంలో అర్థం లేదు. అయితే చాలామంది నటీమణులు ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. కానీ కొంతమంది అంత త్వరగా అంగీకరించరు. అయితే ఖుషీ కపూర్ మాత్రం చాలా సింపుల్ గా ఒప్పుకోవడంతో అందరూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

- Advertisement -

ఖుషీ కపూర్ సినీ కెరియర్..

ఇక కెరియర్ విషయానికి వస్తె.. వేదాంగ్ రైనాతో కలిసి ది ఆర్చీస్ లో నటించిన ఈమె.. ఇటీవల ఇండియా కోచర్ వీక్ లో డిజైనర్ గౌరవ్ గుప్తా షోలో షో స్టాపర్ గా కనిపించింది. ఇక మళ్లీ వేదాంగ్ రైనాతో కలిసి నటించడానికి సిద్ధంగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు