Kiara Advani : గేమ్ ఛేంజర్ హీరోయిన్ ను వెంటాడుతున్న బ్యాడ్ లక్… మరో సినిమా పోస్ట్ పోన్

Kiara Advani : బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీకి ఇటీవల కాలంలో బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టుగా అన్పిస్తోంది. అసలే ఆమె నటిస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ మూవీ రోజు రోజుకూ ఆలస్యం అవుతూ వస్తోంది. తాజాగా ఆమె హీరోయిన్ గా సెలెక్ట్ అయిన మరో మూవీ కూడా పోస్ట్ పోన్ అయ్యింది. ఆ మూవీ ఏంటి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

కియారా కొత్త సినిమా పోస్ట్ పోన్

రణ్‌వీర్ సింగ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన డాన్ 3 మూవీ తాజాగా పోస్ట్ పోన్ అయ్యింది. నిర్మాణ షెడ్యూల్‌ మరింత ఆలస్యం కాబోతోంది. మొదట్లో ఆగస్ట్ 2023లో చిత్రీకరణ ప్రారంభించాలని భావించగా, సినిమా షూటింగ్ జనవరి 2025కి వాయిదా పడింది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం చిత్ర నిర్మాత ఫర్హాన్ అక్తర్ తన రాబోయే చిత్రం 120 బహదూర్‌లో ఉన్న కమిట్‌మెంట్‌ల కారణంగా ఈ షెడ్యూల్ మరింత ఆలస్యం జరబోతోందని సమాచారం. మొత్తానికి దాదాపు నాలుగు నెలల పాటు ఈ సినిమా వాయిదా పడిందని అంటున్నారు. 120 బహదూర్‌లో మేజర్ షైతాన్ సింగ్ PVC పాత్రను పోషించబోతున్న అక్తర్ డాన్ 3 కంటే ఆ ప్రాజెక్ట్‌కు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన ముందుగా ఒప్పుకున్న ఈ మూవీ షూట్ కు చాలా నెలలు పడుతుంది. కాబట్టి డాన్ 3 షెడ్యూల్ దాదాపు నాలుగు నెలల పాటు వాయిదా వేశారని అంటున్నారు. 2025 మే-జూన్ లో డాన్ 3 షూటింగ్ స్టార్ట్ కానుందని టాక్.

Kiara Advani looks like a 'Sexy Queen' in cream-colored studded gown

- Advertisement -

రణవీర్ సింగ్, కియారా అద్వానీల అప్ కమింగ్ ప్రాజెక్ట్స్

రణవీర్ సింగ్‌ను డాన్ పాత్రలో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, అతను ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులపై దృష్టి సారించాడు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఇంకా టైటిల్ ఖరారు చేయని ఓ ప్రాజెక్టు లో ఆయన పని చేస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉండగా రణవేర్ సింగ్‌తో కలిసి డాన్ 3 చేయాల్సిన కియారా అద్వానీ ఖాతాలో కూడా వేరే సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌లతో వార్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. డాన్ 3 నిర్మాణంలో జరిగిన ఈ జాప్యం వల్ల నటీనటులిద్దరూ తమ కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి ఎక్కువ సమయం ఇవ్వబోతున్నారు.

డైరెక్టర్ కు వరుస ఎదురు దెబ్బలు

బాలీవుడ్ డైరెక్టర్ అక్తర్ కు ఇటీవల కాలంలో వరుసగా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఆయన దర్శకత్వంలో రావలసిన డాన్ 3 మాత్రమే కాకుండా అనేక సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. అందులో ప్రియాంక చోప్రా జోనాస్, కత్రినా కైఫ్ , అలియా భట్ నటించాల్సిన ప్రాజెక్ట్ కూడా ఒకటి. బాలీవుడ్ మూవీ లవర్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ జీ లే జరా అనే రోడ్-ట్రిప్ మూవీ కూడా వాయిదా పడింది. ఈ చిత్రం ఆగిపోయినప్పటికీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెరపైకి వస్తుందని డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు