Kiara Advani : జరగండి సాంగ్ తర్వాత ఫోన్ కాల్స్ ఇబ్బంది పెట్టాయి

Kiara Advani : శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికీ కూడా ఎప్పుడు విడుదలవుతుందో సరైన క్లారిటీ లేదు. ఇదే సినిమాతో పాటుగా శంకర్ భారతీయుడు 2 సినిమా పనుల్లో కూడా బిజీగా ఉన్నాడు. భారతీయుడు 2 సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. కానీ గేమ్ చేంజర్ సినిమా గురించి సరైన అప్డేట్ ఒకటి కూడా రాలేదు. ఈ సినిమా ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది అని వార్తలు వినిపించాయి. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

శంకర్ మొదటి తెలుగు సినిమా

పేరుకి శంకర్ తమిళ దర్శకుడు అయినా కూడా తెలుగులో శంకర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. శంకర్ చేసిన సినిమాలకి తెలుగులో మంచి ఆదరణ దక్కింది. శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేయాలని చాలామంది ట్రై చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. మెగాస్టార్ చిరంజీవి శంకర్ దర్శకత్వంలో సినిమా చేయకపోయినా కూడా తన తనయుడు రామ్ చరణ్ శంకర్ సినిమాలో చేస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక పాటను రిలీజ్ చేశారు. ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Game Changer': 1st song 'Jaragandi'

- Advertisement -

అపరిచితుడు సినిమాను తలపిస్తుంది

ఇకపోతే శంకర్ సినిమాలకి ఎక్కువ శాతం ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. కానీ శంకర్ చేసిన అపరిచితుడు సినిమాకి హరీష్ జయరాజ్ సంగీతం అందించారు. ఆ సినిమాలోని కొండా కాకి అనే పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే పాట మాదిరిగానే గేమ్ చేంజర్ సినిమాలో జరగండి అనే పాటను కంపోజ్ చేశాడు తమన్. అయితే ఈ పాట చాలా మంది అభిమానులకు నచ్చిందనే చెప్పాలి. సినిమాలో రామ్ చరణ్ ను కియారా ను చూపించింది తక్కువ షాట్స్ లో అయినా కూడా ఈ సాంగ్ మంచి జోష్ నింపింది.

Game Changer

జరగండి సాంగ్ పై కియారా రెస్పాన్స్

ఇక రీసెంట్ గా 77వ కెనాన్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫిలిం ఫెస్టివల్ కి హాజరైంది కీయారా. అక్కడ ఒక ప్రముఖ బాలీవుడ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో జరగండి సాంగ్ గురించి మాట్లాడింది కియారా. తన లైఫ్ లో ఎప్పుడూ ఇలాంటి సాంగ్ చేయలేదంటూ చెప్పుకొచ్చింది. గేమ్ చేంజర్ సినిమాలోని జరగండి పాటతో పాటు, ఇతర పాటల్లోని బ్యాక్ బ్రేకింగ్ స్టెప్స్ గురించి మాట్లాడింది. ఆ పాట తర్వాత ఇంతకుముందు ఎన్నడు రానని ఫోన్ కాల్స్ తనకు వచ్చాయంటూ చెప్పుకొచ్చింది. సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టు చెప్పింది కియారా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు