Kiara Advani: చరణ్ యాక్టరే కాదు.. గ్రేట్ డాన్సర్ కూడా..

ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య ప్లాప్ కావడంతో అవడంతో చరణ్ నుంచి సాలిడ్ హిట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో RC15 మూవీ తెరకెక్కిస్తున్నారు.

కాగా రీసెంట్ గా సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన ఈ మూవీ హీరోయిన్ కియారా అద్వానీ RC15 సెట్స్ మీదకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా తన కో-స్టార్ రామ్ చరణ్ పై కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. గతంలో రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ మూవీ చేసిన కియారా, ఆయనతో కలిసి పనిచేయడం ఎప్పుడూ లవ్లీ గానే ఉంటుందని చెప్పింది.

చెర్రీ మంచి యాక్టర్ మాత్రమే కాదు, గొప్ప డ్యాన్సర్ కూడా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ సినిమాలో తనతో పాటు రామ్ చరణ్ ని కూడా కొత్తగా చూస్తారని చెప్పింది. RRR లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నప్పటికీ రామ్ చరణ్ లో మార్పులేదని, ఎప్పటికీ ఆయన వినయపూర్వకమైన వ్యక్తి అని చెప్పింది కియారా. సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసే అద్భుతమైన డైరెక్టర్ శంకర్ అని చెప్పిన కియారా అద్వానీ, ఈ నెలలోనే తాను సెట్స్ మీదకు రాబోతున్నట్లు తెలిపింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు