KilinKaara Birthday Special : క్లింకార బర్త్ డే స్పెషల్.. ఉపాసన ఎమోషనల్ వీడియో..

KilinKaara Birthday Special : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కూతురు పుట్టిన విషయం తెలిసిందే.. వీరిద్దరికీ వివాహం అయిన పదేళ్లకు కూతురు పుట్టింది.. ఈ పాప రాక కోసం మెగా ఫ్యామిలితో పాటుగా మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.. ఆ పాప పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీ అంతా శుభవార్తలు వింటున్నారని తెలుస్తుంది.. ఆ పాపకు క్లింకార అనే నామకరణం కూడా చేశారు.. నేటితో పాప పుట్టి ఏడాది అవుతుంది.. ఈ సందర్బంగా ఉపాసన ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

klinkaara birthday special upasana video
klinkaara birthday special upasana video

పాప ఇంట్లోకి అడుగు పెట్టాక రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ఆ తర్వాత వరుణ్ తేజ్ పెళ్లి జరిగింది.. చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం, ఇప్పుడేమో ఏకంగా పవన్ కళ్యాణ్ డిప్యుటీ సీఏం అయ్యాడు.. ఇలా మెగా ఫ్యామిలీకి కలిసి వస్తుండటంతో క్లిన్ కారా పుట్టాకే మెగా ఫ్యామిలీ మరింత సంతోషంగా ఉందని మెగా అభిమానులు చెబుతున్నారు.. అయితే క్లింకారా పుట్టి ఏడాది పూర్తి అయిన ఇంకా ఫేస్ ను చూపించలేదు.. కొన్ని సందర్భాలలో కేవలం కళ్లు మాత్రమే కనిపించాయి.. ఇప్పటికన్నా ఓపెన్ చేస్తారేమో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..

klinkaara birthday special upasana video
klinkaara birthday special upasana video

కూతురు పుట్టినరోజు సందర్బంగా ఉపాసన ఒక ఎమోషనల్ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ వీడియోలో చరణ్, ఉపాసన ఇద్దరూ కూడా ఉపాసన ప్రగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి బేబీ పుట్టేంతవరకు ఎలా ఫీల్ అయ్యారో చెప్తూ ఎమోషనల్ అయ్యారు. తమని అందరూ పిల్లల గురించి అడిగేవాళ్ళని, పెళ్లయిన పదకొండేళ్ల తర్వాత పాప పుట్టడం అందరికి హ్యాపీగా ఉందని, తనని ఫస్ట్ టైం ఎత్తుకున్నప్పుడు మర్చిపోలేనని, తను పుట్టినప్పుడు అభిమానులు అందరూ సెలబ్రేట్ చేసుకున్నారని చెప్తూ ఏడ్చేశారు.. పాప ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నిన్నటివరకు పాపతో గడిపిన క్షణాలను అందులో చూపించారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు