Kiraak RP Comment on Allu Arjun : రోజా నుంచి బన్నీ వైపు మళ్లిన RP… మొత్తం నాశనం చేశాడు అంటూ కామెంట్..!

Kiraak RP Comment on Allu Arjun: ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా గుర్తింపు సొంతం చేసుకొని తనకంటూ ఒక ప్లాట్ఫామ్ ని ఏర్పరచుకున్నాడు జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్ పి.. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో మాటల తూటాలు విసురుతూ అటు నేతలను విచక్షణారహితంగా మాట్లాడుతూ.. వార్తల్లో నిలుస్తున్నాడు.. ఇక ఇప్పుడు తాజాగా నిన్నటి వరకు మాజీ మినిస్టర్ రోజాపై భారీ సంచలన కామెంట్లు చేసిన కిరాక్ ఆర్పి తాజాగా అల్లు అర్జున్ పై చేసిన కామెంట్లు మరింత దుమారాన్ని రేపుతున్నాయి.

అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్న ఆర్పీ..

Kiraak RP Comment on Allu Arjun : RP who turned from Roja to Bunny... has ruined the whole thing..!
Kiraak RP Comment on Allu Arjun : RP who turned from Roja to Bunny… has ruined the whole thing..!

రీసెంట్ గా జరిగిన ఏపీ ఎన్నికలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఒక పని ఇప్పుడు తనకి పెద్ద సమస్యగా మారబోతున్నట్లు తెలుస్తోంది. తమ కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో పోరాడుతున్న పవన్ కళ్యాణ్.. ఈ ఎన్నికల్లో వైసీపీ పై ఒక యుద్ధం ప్రకటించారు.. అయితే ఈ యుద్ధంలో పవన్ కళ్యాణ్ కి తోడుగా మెగా హీరోలు అందరూ నిలబడ్డారు.. చిరంజీవి , నాగబాబు, రామ్ చరణ్ , వరుణ్ తేజ్, సాయి ధరంతేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా మెగా హీరోలంతా మద్దతు తెలపడమే కాదు ఆడవారికి కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూ పిఠాపురం వెళ్లారు.. ప్రత్యేకించి చిరంజీవి సతీమణి సురేఖ కూడా పిఠాపురం వెళ్లి మరీ తన మరిదిని గెలిపించుకోవాలని ప్రచారంలో పాల్గొనింది.. ఇలా తమ కుటుంబాల కోసం అందరూ పరితపిస్తుంటే.. కానీ అల్లు అర్జున్ మాత్రం వైసిపి లీడర్ ఇంటికి వెళ్లి తనకి మద్దతు తెలపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా పవన్ మెగా కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శిస్తూ వచ్చిన వైసీపీకి అల్లు అర్జున్ మద్దతు తెలపడం మెగా అభిమానులకు పూర్తిస్థాయిలో ఆగ్రహాన్ని తెప్పించిందని చెప్పాలి..

సమాధానం చెప్పి తీరాల్సిందే..

నామమాత్రానికి మామ కోసం ఒక ట్వీట్ వేసిన అల్లు అర్జున్.. తన భార్య స్నేహితురాలి భర్తకు మద్దతు తెలపడానికి ఇంటి వరకు వెళ్లడం పవన్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. టిడిపి కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ఇక తాజాగా జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్.పి అల్లు అర్జున్ ని ఏకిపారేస్తూ ప్రశ్నించారు.. పవన్ కళ్యాణ్ ను తిట్టిన వ్యక్తిని మీరు మద్దతు ఇవ్వడం నూటికి నూరు శాతం తప్పు.. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి మీకు బాగా తెలుసు.. ఆయనను చూస్తూనే పెరిగారు.. అలాంటి వ్యక్తిని తిట్టిన వ్యక్తికి మీరు ఎందుకు మద్దతు తెలిపారు.. అనేది ఇక్కడ మాకు తప్పకుండా తెలియజేయాలి. ఒకవేళ మీకు ఏమైనా ఉంటే అవి మీ ఫ్యామిలీ వరకూ చూసుకోవాలి .మా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఒక వ్యక్తికి మీరు సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్.. అసలు మీరు ఎందుకు శిల్పారెడ్డికి సపోర్ట్ చేశారో మాకు సమాధానం తప్పకుండా చెప్పి తీరాలి అంటూ కిరాక్ ఆర్పి కామెంట్లు చేశారు.. మరి దీనిపై బన్నీ ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు