Kiraak RP: వేణు స్వామి బ్రతుకు బండారం.. డెకాయిట్ నా కొ*డు*కు అంటూ సంచలనం వ్యాఖ్యలు..!

Kiraak RP… గత రెండు మూడేళ్లుగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.. గతంలో సినిమాలలో అడపాదడపా నటించిన ఈయన.. ఈమధ్య సెలబ్రిటీల జాతకాలు చెబుతూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ముఖ్యంగా సినీ ప్రముఖుల జాతకాలు మాత్రమే కాదు రాజకీయ నాయకుల భవిష్యత్తు కూడా తెలియజేస్తూ.. వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈయన చెప్పే చెప్పే జాతకాలు నిజమవుతాయో లేదో చెప్పలేము కానీ ఈమధ్య మాత్రం ఆయన పేరు బాగా మారుమ్రోగుతోంది.

వేణు స్వామి పై ఆర్పీ షాకింగ్ కామెంట్..

Kiraak RP: Venu Swami's treasure for life.
Kiraak RP: Venu Swami’s treasure for life.

ఇదిలా ఉండగా తాజాగా జబర్దస్త్ కమెడియన్, ప్రముఖ నటుడు కిర్రాక్ ఆర్పీ వేణు స్వామి పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆయన బ్రతుకును బట్ట బయలు చేస్తూ.. వేణు స్వామి గుట్టు రట్టు చేసిన కిర్రాక్ ఆర్పీ ఏ విషయాలు వెల్లడించారో చూద్దాం..

వేణు స్వామి బ్రతుకు బట్టబయలు చేసిన ఆర్పీ..

కిర్రాక్ ఆర్పీ మాట్లాడుతూ.. వేణు స్వామి వీడొక డెకాయిట్ నా కొడుకు.. వీడికి నాకి ఎటువంటి సంబంధం లేదు.. కానీ వీడు చేసే అక్రమాలను మాత్రం నేను బయట పెడతాను అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు కిర్రాక్ ఆర్పీ.. ఇక ఈయన మాట్లాడుతూ.. వీడు పేరుకే పూజారి.. వీడు అందరి జాతకాలు చెబుతాడు.. కానీ వీడి జాతకం వీడే చెప్పుకోడు… బ్రాహ్మణులంటే ఎలా ఉంటారు.. మంత్రాలు.. నైవేద్యం.. ఉదయాన్నే స్నానం చేసి.. దేవుడికి అగరవత్తులు వెలిగించి.. జంజం వేసుకొని కనిపిస్తారు.. కానీ ఆ లక్షణాలేవి వీడిలో కనిపించవు.. ఉదయం లేవగానే రెండు కేజీల మటన్ ఉండాలి.. రెండు బాటిల్స్ మందు ఉండాలి. పక్కన ఆడవాళ్ళు వుండాలి. రోజూ పబ్బుల్లో వుంటాడు.. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎవరైతే పబ్బుల్లో ఉంటారో.. వారికి దగ్గరగా వెళ్లి వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకుంటాడు.. వారికి మత్తు ఎక్కువైనపుడు.. చెప్పే మాటలను దృష్టిలో పెట్టుకొని.. ఆ తర్వాత ఆ మాటలను బయటకు చెబుతాడు.. ఒకవేళ వీడు చెప్పింది నిజమైతే ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారు.. అసలు వీడికి జాతకం చెప్పడం కూడా రాదు.. కానీ సెలబ్రిటీల వెనకాల వెళ్లి.. వారి రహస్యాలను తెలుసుకొని.. మీడియా ముందు ప్రకటిస్తాడు.. ఒక్కొక్కసారి ఆ విషయాలు జరిగితే ఒక్కొక్కసారి అవి జరగకుండా పోతాయి..

- Advertisement -

వీడిని నమ్ముకొని రూ.25 వేల కోట్ల నష్టం..

ముఖ్యంగా వీడు చేసిన కొన్ని పనుల వల్ల.. మొన్న ఐపీఎల్ లో SRH గెలుస్తుందని చెప్పడం వల్ల పాపం పిల్లవాళ్ళు బెట్టింగ్ వేస్తే ఏకంగా రూ.25 వేల కోట్లు నష్టపోయారు.. అసలు వీడికి జాతకం చెప్పడం రాదు.. కేవలం అమ్మాయిలు ఉంటే చాలు.. అమ్మాయిలతో నగ్న పూజలు చేయిస్తున్నాడని తెలిసింది అంటూ ఆర్ పి తెలిపారు.. ఇకపోతే ఈయన చెప్పింది ఒకటి కూడా జరగలేదని చెబుతూ ఉదాహరణలు కూడా చెప్పుకొచ్చారు కిర్రాక్ ఆర్పీ. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాడు.. కానీ అక్కడ ఆయన గెలవలేదు.. అసలు రేవంత్ రెడ్డి సీఎం అయ్యే యోగం లేదని చెప్పాడు.. కానీ ఆయన సీఎం అయ్యాడు.. వరుణ్ , లావణ్య విడిపోతారని చెబుతున్నాడు.. చంద్రబాబు, పవన్, లోకేష్ జాతకాల గురించి కూడా కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అంటూ తెలిపారు.. ప్రభాస్ కి హిట్ రాదని చెబుతున్నాడు.. కానీ సలార్ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకున్నారు.. అసలు వీడు ప్రజల నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటూ అందరిని నిండా ముంచేస్తున్నాడు వీడో పెద్ద * అంటూ బూతుల వర్షం కురిపించేశారు కిర్రాక్ ఆర్పి.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు