Kiran Abbavaram : ‘కా’ర్తికేయ 2 – ‘కాం’తార – ‘క’ల్కి – ఇప్పుడు ‘క’ … సెంటిమెంట్ ఈ పోస్ట్‌మెన్‌కి వర్కౌట్ అవుతుందా..?

Kiran Abbavaram : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తమను తాము ప్రూవ్ చేసుకొని సొంతంగా నిలద్రొక్కుకొని హీరోగా తమకంటూ కొంత గుర్తింపు సాధించుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ చేసి, వాటితో మంచి గుర్తింపును సాధించుకొని ఆ తర్వాత సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం.

కిరణ్ నటించిన రాజావారు రాజా గారు రాణి గారు సినిమా మంచి హిట్ అయింది. ఆ సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు కిరణ్ అబ్బవరం. అయితే చాలా తక్కువ బడ్జెట్ తో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది. మంచి హిట్ అవడంతో పాటు విమర్శకులు ప్రశంసలను కూడా అందుకుంది ఈ సినిమా. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన రహస్య గోరక్ హీరోయిన్ గా నటించింది.

రాజావారు రాణి గారు సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం చేసిన సినిమా ఎస్సార్ కళ్యాణ్ మండపం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. కోవిడ్ టైం లో వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. అయితే ఈ సినిమాతోనే కిరణ్ అబ్బవరంలో ఉన్న రైటర్ కూడా బయటకు వచ్చాడని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత కిరణ్ సరైన హిట్ సినిమాను ఇప్పటివరకు చేయలేదు.

- Advertisement -

ఈ సినిమా తర్వాత  కిరణ్ అబ్బవరం నుంచి చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ఒక్కటి కూడా థియేటర్ లో ఎక్కువ రోజులు కనిపించలేదు. కొన్ని సినిమాలు అయితే, ఎప్పుడు రిలీజ్ అయ్యాయో కూడా తెలియని పరిస్థితి. బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్ సినిమాలను తెరకెక్కించిన కిరణ్ అబ్బవరం కు ఇప్పుడు బ్లాక్ బాస్టర్ హిట్ కావాలి. అందుకోసం ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకుని తాజాగా ఓ సినిమాను అనౌన్స్ చేశాడు.

ఇకపోతే రీసెంట్ గానే ఒక సినిమాను అనౌన్స్ చేశాడు కిరణ్. ఈ సినిమా టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాలో ఒక పోస్ట్ మాన్ పాత్రలో కిరణ్ కనిపిస్తున్నాడు. అందరి ఉత్తరాలను సీక్రెట్ గా చదువుతుంటాడు కిరణ్. ఈ సినిమా దాదాపు 20 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. కిరణ్ కెరియర్ లో ఇదే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఉత్తరం పైన లెటర్స్ రాస్తూ అప్డేట్ ఇస్తూ వచ్చారు ఇలా ఇవ్వడానికి కారణం ఈ సినిమాలో కిరణ్ పోస్టుమెన్ రోల్ లో కనిపించడమే. ఏదేమైనా ఈ సినిమా సక్సెస్ అయితే కిరణ్ అబ్బవరం మళ్లీ ఇండస్ట్రీలో తన హవా కొనసాగిస్తాడు.

KA టైటిల్ పెట్టడానికి రీజన్…

KA అనే టైటిల్ వినడానికి చాలా డిఫరెంట్‌గా ఉంది. అయితే దీనికి ఓ సెంటిమెంట్ ఉందట. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం స్వయంగా చెప్పాడు. ఇప్పటి వరకు పాన్ ఇండియా లెవెల్‌లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలంటే.. కాంతార, కార్తికేయా 2 తో పాటు తాజాగా కల్కి 2898 ఏడి.. ఈ మూడు సినిమాల్లో కామన్ గా ఉన్నది ఏంటంటే…  స్టార్టింగ్ “KA”. ఇప్పుడు ఈ యంగ్ హీరోకు ప్రస్తుతం ఓ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ కావాలి. సో… ఈ “KA” పేరుతో ఉన్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా వైడ్ హిట్ కావడంతో ఆ… సెంటిమెంట్‌ను ఇప్పుడు వాడుతున్నాడు. అలాగే “KA” అంటే Kiaran Abbavaram కూడా వస్తుంది. అలా… రెండు సింటిమెంట్స్ తో ఈ సినిమా టైటిల్‌ను క్రియేట్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు