Kiran Abbavaram : కేరళలో వరదలు… యంగ్ హీరోకి పెళ్లి కష్టాలు

Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ స్టార్ ఇమేజ్ ను అందుకుంటున్నాడు. రాజావారు రాణిగారు సినిమాతో నటుడిగా ఆరంగేట్రంచేశాడు.. ఆ సినిమా మంచి టాక్ ను అందుకోవడంతో తన కేరీర్ ను కూల్ గా హ్యాండిల్ చేస్తున్నాడు. అయితే ఈ హీరో పట్టుమని పది సినిమాలు కూడా చెయ్యలేదు కానీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడన్న విషయం తెలిసిందే. హీరోయిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. రహస్య గోరఖ్ తో ప్రేమలో పడ్డ సంగత మనకు తెలిసిందే. వీరిద్దరి ఎంగేజ్మెంట్ హైదరాబాదులోని ఓ రిసార్ట్ లో కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

తాజాగా వీరిద్దరు పెళ్లికి డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారని గతంలో చాలాసార్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రావణం మాసం కాబట్టి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టు 22న వీరు తమ పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. కేరళలో రహస్య గోరఖ, కిరణ్ అబ్బవరంలు గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని అనుకున్నారట. అక్కడ ప్రస్తుతం పరిస్థితులు బాగోలేవు అన్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా వరదలు వచ్చాయి. అక్కడ జనాలు జీవించడానికి వీలు లేకుండా ఉంది. అందుకే అనుకున్న డేట్ కే పెళ్లి జరగాలని అనుకోవడంతో పెళ్లి జరిగే ప్రాంతం మారినట్లు తెలుస్తుంది.

Kiran Abbavaram, secret wedding date fix wedding
Kiran Abbavaram, secret wedding date fix wedding

కిరణ్ అబ్బవరం, రహస్య పెళ్లి ఆగష్టు 22 న కర్ణాటకలోని కూరగ్ అనే ప్రాంతంలో జరగనున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ విషయాన్ని హీరో అనౌన్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇదే రోజున మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. తమ పెళ్లి రోజు గుర్తిండి పోవాలని హీరో అలా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ఇక ఆగస్టు 22న జరిగాక ఆగస్టు 24న ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలాగే సెలబ్రిటీలు అందరికీ కలిపి ఒక పెద్ద పార్టీని కిరణ్ అబ్బవరం,రహస్య గోరఖ్ లు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే చాలామంది సెలబ్రిటీలు జైపూర్ లేదా గోవాలలో పెళ్లి చేసుకుంటారు. కానీ వీళ్లు మాత్రమే ఇలా చేసుకోవడం ఏంటి అని చాలా మంది చెవులు కొరుక్కుంటున్నారు. ఏది ఏమైనా వీరిద్దరి పెళ్లి ప్లాన్ బాగుందని టాక్.. ఇక కిరణ్ అబ్బవరం ‘క ‘ అనే సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. మోస్ట్ ప్రామిసింగ్ స్టార్ గా ఉన్న కిరణ్ అబ్బవరం,రహస్య గోరఖ్ లు ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా కలకాలం కలిసి ఉండాలని వీరి అభిమానులు సోషల్ మీడియా లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. ఇక పెళ్లి తర్వాత రహస్య సినిమాలు చేస్తుందా ? లేదా ? అన్నది చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు