Kiran Abbavaram : నీకంత స్థాయి ఉందా? అంటూ జర్నలిస్టు ప్రశ్న… దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram : ఇండస్ట్రీలో టాలెంట్ ఉండి కూడా సరైన సక్సెస్ రాని హీరోలలో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. తెలుగు చిత్ర సీమలో కమర్షియల్ హీరోగా ఎదగడానికి ఈ హీరో తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో వరుస సినిమాలు చేసినప్పటికీ ఈ హీరోను స్టార్ హీరో ఇమేజ్ కి తీసుకెళ్లడంలో ఒక్క మూవీ కూడా సహాయ పడలేదు. ప్రస్తుతం క అనే ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో తాజాగా కిరణ్ అబ్బవరంకి చేదు అనుభవం ఎదురైంది. పాన్ ఇండియా సినిమాలు చేసే రేంజా నీది అంటూ ఓ సీనియర్ జర్నలిస్ట్ అడిగిన షాకింగ్ ప్రశ్నకు కిరణ్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.

పాన్ ఇండియా రేంజా నీది?

సినిమాలకు సంబంధించి జరిగే ప్రమోషనల్ ఈవెంట్లలో లో బడ్జెట్ హీరోలకు ఎప్పటికప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. టాలెంట్ ఉన్నప్పటికీ వాళ్లను అడగరాని ప్రశ్నలు అడిగి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు కొంతమంది. ఇప్పటిదాకా ఇలాంటి ప్రశ్నలు ఎంతో మంది చిన్న హీరోలకు ఎదురు కాగా తాజాగా కిరణ్ అబ్బవరం వంతు వచ్చేసింది. క మూవీ ప్రమోషన్లలో భాగంగా పాన్ ఇండియా రిలీజ్ గురించి ప్రస్తావన వచ్చింది. అయితే ఓ జర్నలిస్టు మాత్రం సూటిగా కిరణ్ అబ్బవరంని ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగారు.

KA Movie (2024): Release Date, Cast, Ott, Review, Trailer, Story, Box Office Collection – Filmibeat

- Advertisement -

పవన్ కళ్యాణ్ లాంటి ఇమేజ్ ఉన్న హీరోలే పాన్ ఇండియా సినిమాలు చేయట్లేదు. అలాంటిది మీరు పాన్ ఇండియా సినిమాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? మీకు తెలుగులోనే పెద్దగా సక్సెస్ లేదని మీరే చెప్పారు. అలాంటిది మీ స్థాయిలో ఉన్న హీరోలు, మీరు ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటూ ప్రశ్నించాడు సదరు జర్నలిస్ట్.

కిరణ్ అబ్బవరం ఎపిక్ రిప్లై…

ఆ ప్రశ్నకు కిరణ్ అబ్బవరం స్పందిస్తూ… ఇప్పుడు స్థాయి అంటే కంటెంటే. మొన్న రిలీజ్ అయిన మంజుమ్మెల్ బాయ్స్ మూవీని మనం పెద్ద హిట్ చేశాము. ఆ సినిమాలో హీరో పేరు ఎవరికైనా తెలుసా? అలాగే కాంతారా మూవీ రిలీజ్ అయ్యేదాకా ఆ సినిమా గురించి, అందులో నటించిన హీరో గురించి కూడా అంతగా తెలియదు. నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఇక్కడ కంటెంట్ కింగ్. నా స్థాయి పెద్దదా చిన్నదా అనేది తర్వాత విషయం. కంటెంట్ కి స్థాయి ఉందా లేదా అన్నదే మేటర్. కంటెంట్ ఉంటే మీరంతా కచ్చితంగా ఆదరిస్తారు, ఎక్కడికో తీసుకెళ్తారు. క అనే మూవీలో కంటెంట్ ఉందని నమ్ముతున్నాను. అందుకే ఇతర లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ చేయాలనుకున్నాను’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో కిరణ్ అబ్బవరం ఇచ్చిన సమాధానం పై ప్రశంసల వర్షం కురుస్తుంది.

కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం కకు సుజిత్, సందీప్ దర్శకత్వం వహించారు. చింతా గోపాల కృష్ణారెడ్డి ఈ సినిమాను నిర్మించారు. కిరణ్ అబ్బవరం భార్య రాయస్య గోరక్ ఈ మూవీ నిర్మాణంలో భాగస్వామి కావడం మరో విశేషం. అంతేకాదు తమ ప్రొడక్షన్ హౌస్ కి సినిమా టైటిల్ క అనే పేరు పెట్టుకున్నారు. ఈ మూవీకి సామ్ సిఎస్ సంగీతం అందిస్తుండగా, పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ మూవీ అయినా కిరణ్ అబ్బవరం కెరీర్ ను మలుపు తిప్పుతుందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు