Kiran Abbavaram New Movie : కిరణ్ అబ్బవరంకు “KA” ‘హాని’ తప్పదా…?

Kiran Abbavaram : టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ఆరంభించి ‘రాజావారు రాణిగారు’ అనే చిన్న సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయమైన ఈ హీరో మొదటి సినిమాతోనే ఆకట్టుకోగా, SR కళ్యాణమండపం అనే సినిమాతో ఓ సక్సెస్ ని అందుకున్నాడు. ఆ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే కూడా అందించి రచయితగా తనలోని టాలెంట్ ని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన కిరణ్ అబ్బవరం, భారీ ప్లాప్ లను అందుకుని డీలా పడ్డాడు. కిరణ్. లాస్ట్ ఇయర్ మొదట్లో వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ఓ మోస్తరు సెమి హిట్ ని అందుకున్న కిరణ్ మళ్ళీ డిజాస్టర్లు అందుకున్నాడు. మంచి అంచనాలతో వచ్చిన మీటర్, రూల్స్ రంజన్ సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. అందుకే కాస్త గ్యాప్ తీసుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు పక్కా ప్లానింగ్ తో సినిమాలు చేయాలనీ ఆచి తూచి అడుగులేస్తున్నాడు.

Kiran Abbavaram's new movie title is Ka

ఊహించని టైటిల్ తో సినిమా…

ఇదిలా ఉండగా రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకున్న కిరణ్ అబ్బవరం తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టాడు. తాజాగా కిరణ్ తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేయగా, కాసేపటికిందే టైటిల్ ని రివీల్ చేసారు మేకర్స్. తన నెక్స్ట్ మూవీ పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని ముందే రివీల్ చేసిన మేకర్స్ ఈరోజు మూవీ టైటిల్ ని రివీల్ చేయగా, సినిమాకి “క” (KA) అనే టైటిల్ ని పెట్టడం జరిగింది. కాగా టైటిల్ పోస్టర్ లో బ్యాక్ నుండి కిరణ్ అబ్బవరం ని చూపించగా, క టైటిల్ వెనుక కొన్ని నంబర్లు ఉండగా, అవి అర్ధం కాకుండా ఉన్నాయి. ఇకపోతే అనౌన్స్ చేసిన టైటిల్ మాత్రం అంత ఇంట్రెస్టింగ్ గా లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

టైటిల్ పై నెగిటివ్ రెస్పాన్స్…

కిరణ్ అబ్బవరం నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్ “క” అని రివీల్ చేయగా, నెట్టింట ఈ టైటిల్ పై నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది. నిజానికి ఈ టైటిల్ నిన్ననే రిలీజ్ కావాల్సింది. కానీ ఏవో టెక్నికల్ సమస్య అని చెప్పి ఈరోజు రిలీజ్ చేసారు. రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ ని చూసి ఈమాత్రం దానికా ఇంత బిల్డప్ ఇచ్చారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆ టైటిల్ కి అర్ధమేంటో కూడా మేకర్స్ రివీల్ చేయలేదు. పోనీ పోస్టర్ బాగుందా అంటే… అదేదో ఫ్యాన్ మేడ్ పోస్టర్ లా అనిపిస్తుంది. మరి మేకర్స్ ఇది గమనించి ఇప్పుడైనా సినిమాపై ఆసక్తిని పెంచేలా ట్రై చేస్తారేమో చూడాలి. ఇక ఈ సినిమాను శ్రీ చక్ర ఎంటర్టైన్మెంట్స్, కే ఏ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. కిరణ్ సబ్బవరం కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు