Kirthi Shetty : అది నా జీవితంలో గ్రేట్ మూమెంట్

Kirthi Shetty : హృతిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ 30 అనే సినిమాలో స్టూడెంట్ పాత్రలో కనిపించింది కృతి శెట్టి. తెలుగులో బుచ్చిబాబు దర్శకుడుగా పరిచయమైన ఉప్పెన సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సంగీత అనే పాత్రలో కనిపించింది కృతి. అయితే ఈ సినిమాలో కీర్తికి బేబమ్మ అని ముద్దు పేరు ఉంటుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. దాదాపు 100 కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా వసూలు చేసింది. ఈ సినిమాతో దర్శకుడు బుచ్చిబాబు, హీరో వైష్ణవ్ , హీరోయిన్ కృతి వీరందరికీ మంచి గుర్తింపు లభించింది.

Krithi Shetty

వరుస డిజాస్టర్ సినిమాలు

ఈ సినిమా తర్వాత రాహుల్ దర్శకత్వంలో శ్యాం సింగరాయ్ అనే సినిమాలో నాని సరసన నటించింది. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి కూడా మరొక హీరోయిన్ పాత్రలో కనిపించింది. అందువలన ఈ సినిమాలో ఎక్కువగా సాయి పల్లవి మంచి పేరు వచ్చింది. ఈ సినిమా మంచి రెస్పాన్స్ సాధించుకున్న కూడా అప్పుడున్న టికెట్ రేట్లను బట్టి ఈ సినిమా కమర్షియల్ గా అంత సక్సెస్ సాధించలేదు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన బంగారు రాజు అనే సినిమాలో కనిపించింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా పరవాలేదు అనిపించింది. ఆ తర్వాత వచ్చిన వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ మంచి సినిమాలు ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

- Advertisement -

నా జీవితంలో అదే గొప్ప మూమెంట్

ప్రస్తుతం శర్వానంద్ సరసన మనమే అనే సినిమాలో నటిస్తుంది కృతి. ఈ సినిమా జూన్ 7న రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది కృతి. ప్రమోషన్స్ లో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఉప్పెన సినిమా చేస్తున్న టైంలో రంగస్థలం అనే సినిమాను చూశానని, అయితే ఆ సినిమా తర్వాత తను రామ్ చరణ్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యానని, ఆయన డెడికేషన్ గురించి చాలా విన్నాను, నిజ జీవితంలో కూడా ఆయన చాలా గొప్ప వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. ఆయనతో నటించే ఛాన్స్ ఎప్పుడైనా వస్తే అనే ప్రశ్నకు “నా జీవితంలో అదే గొప్ప మూమెంట్ అవుతుంది. నేను కచ్చితంగా దానికోసం ట్రై చేస్తానంటూ చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు