Kodi Burra : క్రైమ్ థ్రిల్లర్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న మలయాళ బ్యూటీ.. అది చూస్తే నిద్ర పట్టదు మామా..

Kodi Burra : ఈ మధ్య తెలుగులోకి కొత్త హీరోయిన్ల రాక కాస్త ఎక్కువగానే ఉంది.. ముఖ్యంగా చెప్పాలంటే మలయాళ ముద్దుగుమ్మలు వరుస పెట్టి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.. ఇప్పటికే కీర్తి సురేష్, సంయుక్త మీనన్ వంటి హీరోయిన్లు తెలుగులో స్టార్ హీరోయిన్లుగా రానిస్తున్నారు.. ఇప్పుడు మరో మలయాళ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.. ఏకంగా స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.. ఆ హీరో ఎవరో కాదు శ్రీరామ్..

ఒకరికి ఒకరు, రోజాపూలు, స్నేహితులు, రాగల 24 గంటల్లో వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.. సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రత్యేక చిత్రాలలో నటిస్తూ బిజీగా అవుతున్నాడు.. ఈ హీరో ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ కథతో రాబోతున్న ‘కోడి బుర్ర ‘ అనే సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాను వీ4 క్రియేషన్స్ బ్యానర్‌లో కంచర్ల సత్యనారాయణరెడ్డి, గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్ నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్నారు.. ఇక శృతి మీనన్, ఆరుషి హీరోయిన్లుగా నటిస్తున్నారు..

kodi burra movie latest updates
kodi burra movie latest updates

ఈ సినిమాతో మలయాళ బ్యూటీ శృతి మీనన్ తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.. శ్రీరామ్ ఇలాంటి కథతో రావడం ఇదే మొదటి సారి.. టైటిల్ కు తగ్గట్లే సినిమా కథ మొత్తం క్రైమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రాబోతుందని తెలుస్తుంది.. బుర్ర సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. హీరోయిన్ శృతి మీనన్ డాక్టర్ రోల్ చేస్తోంది.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. తాజాగా ఈ సినిమా నుంచి శృతి మీనన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.. ఆ పోస్టర్ ను చూస్తే కుర్రాళ్లకు నిద్రపట్టదు.. అంత హాట్ గా బికినీతో కనిపిస్తుంది.. సినిమా పేరుకే క్రైమ్ కథ అని అన్నారు కానీ లోపల మాత్రం అవే సీన్లు ఉన్నట్లు పోస్టర్ ను చూస్తే తెలుస్తుంది.. ఆడల్డ్ మూవీగా ఈ మూవీ రాబోతుంది.. మరి ఈ మలయాళ ముద్దుగుమ్మకు ఎలాంటి టాక్ ను అందిస్తుందో చూడాలి…

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు