Kollywood : ధనుష్ పై తమిళ్ సినీ నిర్మాతల మండలి ఫైర్.. పర్మిషన్ ఇస్తేనే సినిమా చేయాలట?

Kollywood : కోలీవుడ్ లో గత కొన్ని రోజులుగా సినీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మొన్న విజయ్, సూర్య వంటి స్టార్లు కూడా సినీ ఇండస్ట్రీపై, అలాగే తమిళనాడు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇక రీసెంట్ గా కోలీవుడ్ లో హీరో విశాల్ కి చిత్ర నిర్మాతల మండలికి మాటల యుద్ధం బాగానే నడిచింది. ఇక లేటెస్ట్ గా కోలీవుడ్ స్టార్ ధనుష్ పై కూడా తమిళ చిత్ర నిర్మాతల మండలి వారు సీరియస్ అయ్యారు. ధనుష్ తో సినిమాలు ఎవరూ చేయొద్దని తీర్మానం చేసిన వారు, తమ పర్మిషన్ తీసుకుంటేనే సినిమా చేయాలనీ అంటున్నారు. దీనిపై వివరాలు ఇలా ఉన్నాయి.

Kollywood Film Producers Council is fire on Dhanush

ధనుష్ పై చిత్ర నిర్మాతల మండలి ఫైర్…

గత కొన్ని రోజులుగా తమిళ చిత్ర నిర్మాతల మండలిలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త కొత్త రూల్స్ పెట్టి కోలీవుడ్ లో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసలు విషయానికి వస్తే… కోలీవుడ్ లో అడ్వాన్స్ లు తీసుకొని పూర్తి చేయని నటీ నటులపై సీరియస్ అయ్యారు. ఇక వారిపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటూ ఆగస్ట్15 తరువాత పలువురు నటీనటులకి సంబంధించి కొత్త సినిమాల షూటింగ్లను నిర్మాతల మండలి నిలిపివేస్తున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ధనుష్ (Kollywood) పై కూడా చిత్ర నిర్మాతల మండలి సీరియస్ అయ్యారు. రీసెంట్ గా కొన్ని సినిమాలకు ధనుష్ అడ్వాన్స్ తీసుకుని టైం కి సినిమా ఫినిష్ చేయట్లేదని ఫైర్ అయ్యారు. అడ్వాన్స్ లు తీసుకొని షూటింగ్స్ పూర్తి చేయడం కేదని ధనుష్ పై కొందరు నిర్మాతల పిర్యాదులు అందాయి.

- Advertisement -

పర్మిషన్ ఉంటేనే సినిమా చేయాలట…

ఇక లేటెస్ట్ గా చిత్ర నిర్మాతల మండలి తెలిపిన వివరాల ప్రకారం తమిళ చిత్ర నిర్మాతల మండలి పర్మిషన్ ఉంటేనే ధనుష్ సినిమాలు చేయాలనీ అంటున్నారట. ధనుష్ మాత్రమే కాదు ఇక పై ఏ హీరో, హీరోయిన్ కూడా అడ్వాన్స్ లు తీసుకోవడం నిషేధిస్తున్నామని, అడ్వాన్స్ లు తీసుకుని పెండింగ్ లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తరువాతే కొత్త సినిమాల షూటింగ్స్ చేయాలనీ అంటున్నారు. ఇక పెండింగ్ లో ఉన్న మూవీలకు ఇచ్చిన అడ్వాన్స్ లపై పలువురు నిర్మాతలను చిత్ర మండలి నివేదిక అడిగారు. ఇక నుంచి ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాకు కాల్షిట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారట. ఇక నిర్మాతల మండలి తీరుతో పలువురు నటీనటులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ధనుష్ నటించిన రాయన్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో థియేటర్లలో వంద కోట్ల దిశగా దూసుకుపోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు