Kollywood Hero: ఎంతోమందితో ఎఫైర్ నడిపిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా.?

Kollywood Hero.. సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే లవ్ ఎఫైర్స్ సహజంగా వినిపిస్తూ ఉంటాయి. కానీ టాప్ హీరోయిన్స్ అందరూ ఒక హీరో వెంట పడడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి. పైన ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయిని మీరు గుర్తుపట్టారా..? ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరోయిన్స్ అందరితో కూడా ఈ కుర్రాడు ఎఫైర్ నడిపించాడు.. ఇక ఈ కుర్రాడు ఎవరో కాదు హీరో శింబు.. చైల్డ్ ఆర్టిస్ట్ గానే కెరియర్ మొదలుపెట్టిన శింబు ..కెరియర్ ప్రారంభంలో ఎక్కువగా లవ్ స్టోరీ సినిమాలు చేసేవాడు.. ఆ తరువాత యాక్షన్ హీరోగా మారిపోయాడు.. హీరో గానే కాదు సింగర్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.. పలువురు స్టార్ హీరోల సినిమాలలో పాటలు పాడి శ్రోతలను అలరించారు కూడా.

Kollywood Hero: Do you remember this boy who had affair with many people?
Kollywood Hero: Do you remember this boy who had affair with many people?

గ్లామర్ డాల్స్ అంతా ఈ కుర్రాడి చుట్టూనే..

హీరోగా మారిన తర్వాత ఎన్నో చిత్రాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఈయన తోటి నటీనటులు అందరూ పెళ్లిళ్లు చేసుకొని తల్లిదండ్రులు అవుతుంటే.. ఈయన మాత్రం ఇంకా వివాహానికి దూరంగానే ఉన్నారని చెప్పాలి. ఇప్పుడైతే ఈయన గురించి పెద్దగా వార్తలు వినిపించడం లేదు కానీ గతంలో ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక వార్త ఈయన గురించి హల్చల్ చేసేది.. అంతలా మనోడు ఎఫైర్స్ వార్తల్లో నిలిచేవారు.. చైల్డ్ ఆర్టిస్టుగా బోలెడు సినిమాలు చేసిన శింబు.. డైరెక్టర్ రాజేందర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.. మన్మధ, వల్లభ సినిమాలతో తెలుగు వారికి కూడా పరిచయమైన శింబు అంటే గ్లామర్ డాల్స్ అంతా పడి చచ్చేవాళ్ళు.

ఎఫైర్ లిస్ట్ పెద్దదే..

అలా కెరియర్ ప్రారంభంలోనే నయనతారతో ప్రేమ వ్యవహారం నడిపించిన ఇతగాడు.. ఆ తర్వాత హన్సిక, త్రిష, నిధి అగర్వాల్ , ఆండ్రియా ఇలా చెప్పుకుంటూ పోతే మీడియాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే… తెలియని వాళ్ళు ఆ లిస్టులో ఇంకా ఎంతమంది ఉన్నారో. ఇలా శింబు డేటింగ్ చేసిన హీరోయిన్ లిస్టు చాలా పెద్దగానే ఉంటుంది. ఒకానొక దశలో హన్సిక , నిధి అగర్వాల్ తో ఈయన వివాహం చేసుకుంటాడని పుకార్లు షికార్లు చేశాయి.. కానీ అందులో నిజం లేకపోయింది.. మరొకవైపు శ్రీలంకకు చెందిన అమ్మాయితో త్వరలోనే వివాహం జరగబోతోంది అని వార్తలు రాగా ఆ వార్తలలో నిజం లేకపోయింది. ఇంకొక వైపు శింబు తండ్రి .. కొడుకుపై వరుస్తున్న వార్తలను తట్టుకోలేక తమ బంధువుల అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి.. అవి కూడా వార్తల వరకే పరిమితం అయ్యాయి ..ఇక ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్న ఈయన ఇప్పటికి కోలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధుడి గానే పేరు సొంతం చేసుకున్నారు. మరి ఎప్పుడు వివాహం చేసుకుంటారో తెలియాల్సి ఉంది..ఈయన వివాహం కోసం అభిమానులు , సెలబ్రిటీలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు