Kollywood: విడుదలకు ముందే తంగలాన్ , కంగువ చిత్రాలకు షాక్ ఇచ్చిన హైకోర్టు..!

Kollywood: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్ తాజాగా నటించిన చిత్రం తంగలాన్. ఆగస్టు 15వ తేదీన విడుదల కావాల్సి ఉండగా అప్పుడే ఈ సినిమా చిక్కుల్లో పడిందని సమాచారం. అలాగే కోలీవుడ్ లోనే హీరో సూర్య నటిస్తున్న ప్రస్తుత చిత్రం కంగువ.. అయితే ఈ రెండు సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. విడుదల కాకముందే మద్రాస్ కోర్టు ఈ రెండు చిత్రాలకు భారీ షాక్ ఇచ్చింది. అంతేకాదు సినిమా విడుదల కావాలంటే రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని మద్రాస్ కోర్టు తీర్పు ఇచ్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Kollywood: High Court shocked Thangalan and Kanguva films before their release..!
Kollywood: High Court shocked Thangalan and Kanguva films before their release..!

అసలు ఏం జరిగిందంటే..?

అసలు విషయంలోకి వెళ్తే తంగలాన్, కంగువ సినిమాల నిర్మాత కె. ఈ.జ్ఞానవేలు ఒక వ్యాపారవేత్తకు రూ .10.35 కోట్లు బకాయి పడినట్లు ఆరోపణలు రావడంతో తమిళనాడు హైకోర్టులో ఈ కేసు విచారించబడింది. 2011లో అర్జున్ లాల్ సుందర్ దాస్ ఒక సినిమా నిర్మాణం కోసం జ్ఞానవేలు గ్రీన్ స్టూడియోకి రూ .12.85 కోట్లు ఇచ్చారు. అయితే సినిమా నిర్మాణం సగంలోనే ఆగిపోవడంతో కేవలం రూ.2.5 కోట్లు మాత్రమే అర్జున్ లాల్ సుందర్ దాస్ కి జ్ఞానవేల్ తిరిగి ఇచ్చి రూ.10.35 కోట్లు బ్యాలెన్స్ ఉంచినట్లు సమాచారం. అయితే అనుకోకుండా కొన్ని కారణాలవల్ల అర్జున్ లాల్ సుందర్ దాస్ మరణించారు.అయితే ఆయన కుటుంబం గ్రీన్ స్టూడియో పై కేసు వేసింది. ఈ నేపథ్యంలోనే గ్రీన్ స్టూడియో నిర్మించిన తంగలాన్ , కంగువ చిత్రాలకు ఇబ్బందులు ఎదురయ్యాయని సమాచారం.

కేస్ పై స్పందించిన జ్ఞానవేలు..

అయితే తాజాగా ఈ విషయాలపై జ్ఞానవేలు మాట్లాడుతూ.. అర్జున్ లాల్ సుందర్ దాస్ గతంలో నేను నిర్మించిన మూడు తమిళ సినిమాల హిందీ డబ్బింగ్ హక్కులు కొనుగోలు చేసి,వాటికి ఇవ్వాల్సిన డబ్బుకు బదులుగా ఆ రూ.12.85 కోట్లు ఇచ్చాడు. అంతేతప్ప నాకు ఎటువంటి డబ్బు ఇవ్వలేదు. కానీ అందుకు సంబంధించిన ఒక జిరాక్స్ ను మాత్రమే కోర్టుకు డాక్యుమెంట్ గా ఇచ్చారు.

- Advertisement -

జ్ఞానవేలు పై కేసు వేసిన సుందర్ దాస్ కుటుంబ సభ్యులు..

అయితే ఈ విషయంపై స్పందించిన సుందర్ లాల్ కుటుంబ సభ్యులు.. 2015 వరదల్లో అసలు రికార్డు ధ్వంసం అయిందని తెలిపారు. అందులో నిజం లేదు..వాస్తవానికి గ్రీన్ స్టూడియో అప్పటి కార్యాలయం రెండవ అంతస్తులు ఉంది. ఆ కార్యాలయానికి సంబంధించిన ఫైల్ ఏవి కూడా వరదలో కొట్టుకుపోలేదు అని, ఆ తర్వాత నిర్ధారించబడింది గ్రీన్ స్టూడియో బకాయి ఉన్న రూ.10.35ను 18% వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ అర్జున్ లాల్ సుందర్ దాస్ కుటుంబం కేస్ వేసింది.

మద్రాస్ కోర్టు సంచలన నిర్ణయం..

దీనిపై కేసు విచారించిన కోర్టు గ్రీన్ స్టూడియోస్ నేరం చేసినట్లుగా గమనించి, ఇకపై ఈ బ్యానర్ నుండి ఏదైనా సినిమా విడుదల చేయాలంటే ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఇక ఈ విషయాలు తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు విక్రమ్, సూర్య అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాదు తమ స్టార్ హీరోల సినిమాలు వస్తాయని ఆనందపడేలోపే ఇలాంటి వార్త రావడంతో మరింత నిరాశ వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు