DilliBabu PassesAway : ప్రముఖ తమిళ సినీ నిర్మాత కన్నుమూత.. షాక్ లో ఇండస్ట్రీ..

DilliBabu PassesAway : కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. తమిళం లో పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ప్రముఖ సినీ నిర్మాత జి.ఢిల్లీ బాబు (DilliBabu) ఈరోజు తెల్లవారు జామున మృతి చెందారు. ఆయన మృతికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళ (Kollywood) ఇండస్ట్రీలో ఎందరో కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించి, వారిని మంచి దర్శకులుగా తీర్చి దిద్దడమే కాకుండా, ఎన్నో మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించారు నిర్మాత ఢిల్లీ బాబు. ఆయన స్థాపించిన నిర్మాణ సంస్థ “యాక్సిస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ” ద్వారా ఎంతో మంది హీరోలకు, దర్శకులకు లైఫ్ ఇచ్చాడు. తమిళ ఇండస్ట్రీలో యాక్సిస్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌ లో ఓ సినిమా వస్తుందంటే, ఖచ్చితంగా కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు చెప్పుకునేవారు. ఆ స్థాయిలో విభిన్నమైన చిత్రాలను నిర్మించారు ఢిల్లీబాబు.

Kollywood producer DilliBabu Passes Away

ఢిల్లీబాబు కన్నుమూత.. షాక్ లో ఇండస్ట్రీ..

అయితే నిర్మాత డిల్లీ బాబు ఈరోజు అనగా సెప్టెంబర్ 9 తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన హఠాన్మరణం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో ఉన్న ఢిల్లీ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఈరోజు మృతి చెందారు. ఆయన మృతి పట్ల తమిళనాట దర్శకులు, నటీనటులు, పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఢిల్లీ బాబు మరణించేనాటికి అయన వయసు 50 ఏళ్ళు. దాదాపు పదిహేనేళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్న అయన ఎన్నో సినిమాలు నిర్మించారు.

- Advertisement -

ఢిల్లీ బాబు నిర్మించిన సినిమాలివే!

ఇక తమిళ (Kollywood) ఇండస్ట్రీలో దాదాపు పదేళ్లుగా సంవత్సరాలుగా సినిమాలను నిర్మించిన డిల్లీ బాబు 2015లో విడుదలైన “ఉరుమీన్” చిత్రంతో తమిళ చిత్రసీమలో నిర్మాతగా అడుగుపెట్టారు. ఆ తర్వాత యాక్సిస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ లో నిర్మించిన ఎమరాల్డ్ కాయిన్, రాక్షసన్, ఓ మై గాడ్, బ్యాచిలర్, గాల్వన్ వంటి చిత్రాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా మరగతమణి, రాక్షసన్, ఓ మై గాడ్, బ్యాచిలర్ వంటి చిత్రాలు అత్యధిక రికార్డ్ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక డిల్లీ బాబు నిర్మించిన మరకతమణి (Marakathamani), మిరల్ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయి మంచి ఆదరణ దక్కించుకున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు