Kollywood Producer: మీనా,ఆమె తల్లి నన్ను దారుణంగా అవమానించారు..!

Kollywood Producer: తెలుగు ,తమిళ, మలయాళం ప్రేక్షకులకు హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన మీనా.. స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. తన జీవితంలో ఎప్పుడూ కూడా వివాదాలకు మాత్రం తావు ఇవ్వలేదు. 40 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా రాణించింది మీనా. అయితే తన భర్త మరణం తర్వాత మీనా ఎక్కువగా తరచూ వార్తలలో నిలుస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మీనా, ఆమె తల్లి తనను అవమానించింది అంటూ ఒక నిర్మాత పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వాటి గురించి చూద్దాం.

నిర్మాతను ఇన్సల్ట్ చేసిన మీనా..

Kollywood Producer: Meena, her mother insulted me badly..!
Kollywood Producer: Meena, her mother insulted me badly..!

ప్రముఖ నిర్మాతలలో ఒకరైన మాణిక్యం నారాయణన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను సైతం తెలియజేశారు.. ఏదో ఒక ప్రోగ్రాం చేయడానికి హీరోయిన్ మీనా దగ్గరకి వెళ్లానని అయితే అటు నుంచి తనకు సరైన స్పందన రాలేదని తెలిపారు.. ఆ సమయంలో మీనానే కాకుండా తన తల్లి కూడా చాలా దురుసుగా మాట్లాడినట్లుగా తెలియజేశారు మాణిక్యం నారాయణన్. తాను ఒక నిర్మాత అయి ఉండి ఎన్నో సినిమాలకు నిర్మించాను. కానీ తనను పట్టుకొని చాలా చీప్ గా మాట్లాడడంతో చాలా బాధేసింది అని తెలియజేశారు.

చాలామంది హీరోయిన్స్ తో పని చేశా – నిర్మాత

దీంతో తన జీవితంలో ఇంకెప్పుడు ఎవరిని కూడా ఏమీ అడగకూడదని తెలుసుకున్నానని తెలిపారు మాణిక్యం నారాయణన్.. తన సినీ కెరియర్లో ఖుష్బూ, రోజా, సుహాసిని తో పాటు చాలామంది సెలబ్రిటీలు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలియజేశారు.వీరందరూ కూడా తన కుమారుడు వివాహానికి కూడా హాజరయ్యి ఆశీర్వదించారని కూడా తెలియజేశారు. వీరందరితో ఎన్నో సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించానని వెల్లడించారు మాణిక్యం నారాయణన్.. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉండడం కూడా చాలా ముఖ్యమే అంటూ వివరించారు.

- Advertisement -

క్లారిటీ మాత్రం ఇవ్వలేదు..

అయితే మీనా తల్లి మీనా ఏం మాట్లాడారు అనే విషయం గురించి మాణిక్యం నారాయణన్.. పూర్తి విషయాలను మాత్రం తెలియజేయలేదు. కానీ ఈయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారుతున్నాయి. కానీ నిర్మాత సౌమ్యంగా కనిపించేటువంటి మీనా పైన ఇలాంటి ఆరోపణలు చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. విద్యాసాగర్ అనే వ్యక్తిని మీనా 2009లో వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. 2022లో మీనా భర్త విద్యాసాగర్ మరణించారు. తర్వాత ఈమె పై ఎన్నో రూమర్స్ వైరల్ అయ్యాయి… రెండో వివాహం చేసుకోబోతోంది అంటూ కూడా పలు వార్తలు వినిపించాయి కానీ వాటన్నింటిపై క్లారిటీ ఇచ్చింది మీనా.. ఇప్పుడు ఇండస్ట్రీలోకి రీయంట్రీ ఇవ్వడానికి పలు రకాల ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉంది.. మరోపక్క పలు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మొత్తానికి అయితే మీనా కూడా ఇలా దురుసుగా ప్రవర్తించిందా అని తెలిసి అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ ప్రస్తుతం నిర్మాత చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు