Vishal : సినిమాల్లో ప్రభుత్వం జోక్యమేంటి..? నేను సినిమాలు చేస్తా… దమ్ముంటే నన్ను ఆపండి.

Vishal : కోలీవుడ్ స్టార్ విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న ఈ హీరో వరుస సినిమాలతో ఫ్యాన్స్ ని అలరిస్తున్నాడు. అయితే సినిమాలతో పాటు పలు సామజిక కార్యక్రమాల్లో కూడా విశాల్ యాక్టీవ్ గా ఉంటాడన్న విషయం తెలిసిందే. అలాగే కొన్నేళ్ల కింద తమిళ ఇండస్ట్రీ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా కూడా పని చేసారు. ఇప్పుడు సంఘంలో పదవిలో లేకపోయినా, ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో పలు సమస్యల్ని పరిష్కరిస్తుంటాడు. అలాగే సమాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రభుత్వాల తీరుని కూడా ముక్కుసూటిగా ఎదుర్కొనే ధైర్యం తనది. ఆ మధ్య మార్క్ ఆంటోనీ సినిమా రిలీజ్ టైం లో కూడా థియేటర్ల మాఫియాపై ఫిలిం ఇండస్ట్రీ ప్రతినిధుల్ని, ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాడు. రీసెంట్ గా తమిళనాడులో వరదల విషయంలో ప్రజలని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ విజ్ఞప్తి చేసాడు. ఇదిలా ఉండగా తాజాగా తమిళ నిర్మాతల మండలి విశాల్ తో ఎవరూ సినిమాలు తీయొద్దని చర్యలు తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. దానికి విశాల్ తనదైన శైలిలో మాస్ రిప్లై ఇచ్చాడు.

Kollywood star Vishal Fire on Tamil Producers Council & governament

టీఎఫ్‌పీసీ కి విశాల్ మాస్ వార్నింగ్…

లేటెస్ట్ గా విశాల్ (Vishal) తమిళ నిర్మాతల మండలిపై, అలాగే ప్రభుత్వాన్ని కూడా ఇండైరెక్ట్ గా ప్రశ్నిస్తూ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ట్విట్టర్ ఖాతాలో విశాల్ ఈ విధంగా పోస్ట్ చేసాడు. “మనమంతా ఓ బృందంగా, సమష్టిగా కలిసి తీసుకున్న నిర్ణయాలు నీకు తెలియదా.. ‘మిస్టర్ కథిరేసన్’.. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌ లోని సభ్యుల సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేశాం. విద్య, వైద్య బీమా మరియు వృద్ధులు / కష్టాల్లో ఉన్న సభ్యుల సంక్షేమ పనుల కోసం నడిగర్ సంఘం నిధులు ఉపయోగించబడ్డాయి. కౌన్సిల్ సభ్యులు పేద కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా, మీ ఉద్యోగాలను మీరు సరిగ్గా చేయండి. మరియు పరిశ్రమ కోసం పని చేయడానికి చాలా ఉంది. డబుల్ టాక్సేషన్, థియేటర్ మెయింటెనెన్స్ ఛార్జీలు మరియు చాలా విషయాలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ విశాల్ ఎప్పుడూ సినిమాలు చేస్తూనే ఉంటాడు. మీరు ఆపడానికి ప్రయత్నిస్తే, ఆపడానికి ప్రయత్నించండి.. అంటూ విశాల్ ట్వీట్ వేసాడు.

- Advertisement -

ఒక్క ట్వీట్ తో కడిగిపడేసాడు…

ఇక విశాల్ నిన్న రాత్రి వేసిన ఈ ట్వీట్ తో కోలీవుడ్ నెట్టింట సెన్సేషన్ అవుతుంది. డైరెక్ట్ గా చిత్ర నిర్మాతల మండలిని, అలాగే ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ మాస్ ట్వీట్ వేసాడు. ఇక రీసెంట్ గా తమిళ నాడులో జరిగిన ప్రమాదాలకు సంబంధించి ఇప్పటికే విజయ్, సూర్య వంటి స్టార్ హీరోలు కూడా ప్రభుత్వాన్ని విమర్శించిన సంగతి తెలిసిందే. ఇక విశాల్ వేసిన ఈ ట్వీట్ కి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నా, చిత్ర నిర్మాతల మండలి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి. ఇక విశాల్ ప్రస్తుతం డిటెక్టివ్ సీక్వెల్ లో నటిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు