Kollywood: కూల్ డ్రింక్ లో మత్తుమందు వేసి యువతిపై రేప్… నిర్మాత అరెస్ట్

Kollywood : కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి యువతిని రేప్ చేసినందుకు గాను ఓ నిర్మాతను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణమైన ఘటన ఎక్కడ జరిగింది? ఇంతకీ ఇలాంటి చెత్త పని చేసిన ఆ నిర్మాత ఎవరు? అనే వివరాల్లోకి వెళితే…

అసలు వివాదం ఏమిటంటే?

చెన్నైలోని కొలత్తూరు ప్రాంతానికి చెందిన మహమ్మద్ అలీ అనే నిర్మాత ఈ దారుణమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతని వయసు 30 ఏళ్లు కాగా, కిలయ్యనంబాక్కం అనే ప్రాంతంలో సినిమా నిర్మాణ సంస్థను నడుపుతున్నాడు. అయితే గత ఏడాది సెప్టెంబర్ లో కొరుటూరు ప్రాంతానికి చెందిన ఓ 28 ఏళ్ల యువతి ఆయన ఆఫీస్ లో చేరింది. తరువాత నెమ్మదిగా ఆ అమ్మాయితో ప్రేమ వ్యవహారం మొదలు పెట్టాడు మహమ్మద్ అలీ. పెళ్లి చేసుకుంటానంటూ చెప్పి ఆమెను శారీరకంగా వాడుకోవడమే కాకుండా, అబార్షన్ కూడా చేయించినట్టు సమాచారం.

కేసు పెట్టిన యువతి…

అసలు విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఆ అమ్మాయి ఈ ఏడాది మే 13న అంబత్తూరు ఆల్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో వేధింపులపై ఫిర్యాదు చేసింది. అందులో సినిమా నిర్మాణ సంస్థ నడుపుతున్న మహ్మద్ అలీ తనకు పెళ్లయిందన్న విషయాన్ని దాచి పెట్టి నన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి మోసం చేశాడు అంటూ కంప్లయింట్ చేసింది.

- Advertisement -

Tamil film producer held for raping employee, blackmailing her with videos

మత్తు మందు కలిపి.. వీడియో కూడా..

అంతేకాకుండా ఆ కంప్లయింట్ లో నాకు తెలియకుండా సాఫ్ట్ డ్రింక్స్ లో మత్తు మాత్రలు కలిపి నాపై అత్యాచారం చేశాడు. దాన్ని వీడియోగా కూడా రికార్డ్ చేశాడు అని పేర్కొంది. దీంతో నేను గర్భం దాల్చడంతో పౌష్టికాహార మాత్రలంటూ అబార్షన్ మాత్రలు వేసుకునేలా చేశాడు. ఆ టాబ్లెట్స్ ద్వారా అబార్షన్ అయ్యేలా చేశాడు. ఈ వ్యవహారం గురించి అడిగితే బయట ఎక్కడైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అందువల్ల అతడిని అరెస్టు చేసి తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం పోలీసులు విచారణ జరిపగా ఆ ఆరోపణలు నిజమేనని తేలింది.

నిర్మాత అరెస్టు

ఆ అమ్మాయి ఫిర్యాదు అనంతరం చిత్ర నిర్మాత మహమ్మద్ అలీపై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం అంబత్తూరు కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. కూల్ డ్రింక్స్ లో మత్తు మందు మాత్రలు కలిపి, యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెకు అబార్షన్ అయ్యేలా చేసిన సినీ నిర్మాతను అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు.

ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు నిర్మాత మహమ్మద్ అలీపై దుమ్మెత్తి పోస్తున్నారు. జాబ్ కోసం వచ్చిన అమ్మాయిని ఇలా మోసం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ప్రెగ్నెంట్ చేసి తెలియకుండానే అబార్షన్ చేసిన అతన్ని తీవ్రంగా శిక్షించాలి అని మండి పడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ లో దుమారం రేపుతోంది. అమ్మాయిలు ఇలాంటి వారి దగ్గర జాగ్రత్తగా ఉండాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు