Koratala Shiva : పాపం కొరటాల… రూ.25 కోట్లు నష్టపోయాడు..!

రాజమౌళి తర్వాత టాలీవుడ్లో అపజయమెరుగని దర్శకుడిగా కొరటాల శివ పేరు ఎక్కువగా వినిపించేది.ఆయన తీసిన ‘మిర్చి’ ‘శ్రీమంతుడు’ ‘జనతా గ్యారేజ్’ ‘భరత్ అనే నేను’ ఇలా అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. అదే కోవలో ‘ఆచార్య’ కూడా హిట్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఈ మూవీ ఘోరంగా డిజాస్టర్ అయ్యింది.చిరు- చరణ్ లు కలిసి నటించిన ఈ మూవీ పై మొదట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాంచరణ్ నుండీ రాబోతున్న మూవీ కావడంతో మరింతగా అంచనాలు పెరిగాయి.కానీ ఆ పెరిగిన అంచనాలకి తగినట్టు ఓపెనింగ్స్ కూడా రాలేదు.

బయ్యర్లు, డిస్టిబ్యూటర్లకు తీవ్రంగా నష్టపోయారు. ఈ మూవీ వల్ల రూ.80 కోట్లు పైనే నష్టపోయారు బయ్యర్లు. దీంతో చిరంజీవి రూ.10 కోట్లు వెనక్కి ఇచ్చారట. దర్శకుడు కొరటాల శివ అయితే తన వంతు రూ.25 కోట్లు వెనక్కి ఇచ్చారని తెలుస్తుంది.అంటే కొరటాల తన నాలుగు సినిమాలకి సంపాదించుకున్నదాంట్లో సగానికి సగం పైనే ఇచ్చేసినట్టే. ‘మిర్చి’ సినిమాకి కొరటాల శివకి పారితోషికం అంతగా లేదు. దానికి లాభాల్లో వాటాగా రూ.5 కోట్ల వరకు వచ్చింది.

ఇక ‘శ్రీమంతుడు’ నుండీ సినిమాకి రూ.10 కోట్లు చొప్పున తీసుకుంటూ వచ్చాడు. ‘ఆచార్య’ కి అయితే అడ్వాన్స్ రూ.5 కోట్లు తప్ప పారితోషికం తీసుకోలేదు. కాబట్టి కొరటాల సంపాదన రూ.40 కోట్లు అయితే అందులో ‘ఆచార్య’ బయ్యర్స్ కు రూ.25 కోట్లు వరకు ఇచ్చేసాడు. ‘ఆచార్య’ వల్ల కొరటాల 4 ఏళ్ళు టైం వేస్ట్ చేశాడు. ఆ నాలుగేళ్లలో మరో 4 సినిమాలు అయినా కొరటాల చేసుకునేవాడు. రూ.40 కోట్లు సంపాదించుకునేవాడు. ఇప్పుడు అంతా నష్టమే. ఎన్టీఆర్ సినిమాతో మళ్ళీ కొత్తగా స్టార్ట్ గా చేయాలి..!

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు