Koratala Siva: రెండు సంవత్సరాల నుంచి షూటింగ్, రెండు నెలల్లో రిలీజ్, కనీసం రెండు పాటలు లేవు

Koratala Siva: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రచయితగా పనిచేసే మిర్చి సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు కొరటాల శివ. మొదటి సినిమాతోనే ఒక బ్లాక్ బస్టర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక రచయిత మరియు దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో శ్రీమంతుడు వంటి సినిమాను తెరకెక్కించి 100 కోట్లు మార్కెట్ కి దారి చూపించాడు. శ్రీమంతుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కొరటాల శివ చేసిన అన్ని సినిమాలు మాక్సిమం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్స్ గా నిలిచాయి.

కొరటాల శివ సినిమాలకు ఒక ప్రత్యేకత ఉంది ఒక కమర్షియల్ సినిమాలు తెరకెక్కించడం మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక అంశాన్ని తన సినిమాలు ద్వారా చూపిస్తూ ఉంటాడు. వరుస హిట్ సినిమాలు చేసే కొరటాల శివ కి ఆచార్య రూపంలో ఒక డిజాస్టర్ సినిమా తగిలింది. అప్పటివరకు కొరటాల శివ సాధించుకున్న పేరు మొత్తం ఆ సినిమాతో పోయింది. సినిమా పోవడంతో పాటు ఆర్థికంగా కూడా చాలా దెబ్బతిన్నాడు కొరటాల. అప్పటివరకు ఆకాశానికి ఎత్తిన వాళ్లే ఉన్నపలంగా పాతాళానికి తోసేశారు. మొదటిసారి ఓటమి కూడా ఎలా ఉంటుందో ఆ సినిమాతో చవి చూశాడు.

ఇకపోతే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా దేవర. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా ఇంకో రెండు నెలల్లో రిలీజ్ కి సిద్ధమవుతుంది. కానీ ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ విషయంలో టీమ్ ఇంకా డిలీట్ చేస్తూనే ఉంది. రిలీజ్ కి రెండు నెలలు ఉన్నా కూడా కనీసం రెండు పాటలను ఇప్పటివరకు రిలీజ్ చేసుకోలేకపోయింది. ఈ సినిమాకి సంబంధించి సరైన పబ్లిసిటీ కూడా లేకుండా పోయింది.

- Advertisement -

Jr NTR Devara: Part 1

కొరటాల శివ లాస్ట్ ఫిలిం ఆచార్య కూడా ఇలానే జరిగింది. మొదటిసారి చిరంజీవి సినిమాకి అసలు బజ్ లేకుండా పోయింది అంటూ చాలామంది కామెంట్స్ కూడా చేశారు. ఇక ఈ పాన్ ఇండియా మూవీకి ప్రమోషన్స్ మొదలుపెట్టి జనాలు తీసుకెళ్తే గాని సినిమా ఇంపాక్ట్ ను చూడలేము అని టీం కి అర్థం అవ్వాలి. ఇకపోతే ఈ సినిమాను గత రెండు సంవత్సరాలుగా షూట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇదివరకే అనుకున్న డేట్ నుంచి వాయిదా కూడా పడింది. మళ్లీ వాయిదా పడితే సినిమాను ట్రోల్ చేయడం కూడా ఖాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు