Kota Srinivas Rao: ఇప్పుడున్న హీరోల్లో అతడే నం.1

Kota Srinivas Rao: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అతి చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఎన్నో సినిమాల్లో నటించి అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఇక ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస సినిమాలతో ఎప్పుడు తన ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు. ఎన్టీఆర్ తాజాగా దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కనుంది.

దేవర సినిమా మొదటి పార్ట్ అక్టోబర్ 10వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుందట. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, సినీ ఇండస్ట్రీలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2లో నటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సినిమా అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారట.

ఇక ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అంటే ఎంతోమంది సినీ నటీనటులకు విపరీతమైన అభిమానం. ఎన్టీఆర్ అంటే విపరీతమైన ఇష్టం. ఈ క్రమంలోనే తాజాగా కోటా శ్రీనివాస్ ఎన్టీఆర్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…. ఇప్పుడున్న టాలీవుడ్ నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ వన్ అని అభిప్రాయపడ్డాడు. తనకు నచ్చిన నటీనటుల్లో జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

Jr Ntr Devara Movie Latest Shooting Update
ఇప్పుడున్న కుర్ర బ్యాచ్ లో డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, యాక్టింగ్ లో సత్తా ఉన్న వ్యక్తి ఎన్టీఆర్. అతనిలో ఆ పొటెన్షియాలిటీ ఉంది. ఎన్టీఆర్ తర్వాత అల్లు అర్జున్, మహేష్ బాబు అని చెప్పారు. ఇక తాను చివరి శ్వాస వరకు సినిమాలలో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కోటా శ్రీనివాస్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఇక అంత పెద్ద నటుడు ఎన్టీఆర్ గురించి అలా చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు