Kottukkali : కోలీవుడ్ లో వెరైటీ సినిమా.. మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా!

Kottukkali : కోలీవుడ్ కమెడియన్ గా ఎదిగి హీరోగా కొనసాగుతున్న నటుడు “సూరి”. ఇప్పుడు వరుస సినిమాలతో సక్సెస్ కొడుతూ దూసుకుపోతున్నాడు. లాస్ట్ ఇయర్ విడుదలై సినిమాతో సక్సెస్ కొట్టగా, రీసెంట్ గా “గరుడన్” సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇప్పుడు మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక కోలీవుడ్ లో కొత్తదనం ఉన్న సినిమాలు మనకంటే కాస్త ఎక్కువే తెరకెక్కుతుంటాయి. అక్కడ ప్రయోగాలకి పెద్ద పీట వేస్తుంటారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ క్రేజి సినిమా కోలీవుడ్ లో అంచనాలను పెంచేస్తుంది. ఆ సినిమాతో విన్నూత ప్రయోగం చేస్తున్నారు మేకర్స్.

Kottukkali movie was made without a music director

మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా కొట్టుక్కలి…

కమెడియన్ కం హీరో సూరి (Soori) ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా సినిమా “కొట్టుక్కలి”. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ (Siva Karthikeyan) నిర్మాతగా వ్యవహరిస్తూ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాలో కల్కి ఫేమ్ అన్నా బెన్ ఫిమేల్ లీడ్ రోల్‌ లో నటిస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను రీసెంట్‌ గా రిలీజ్ కాగా, యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇక ట్రైలర్ వెరైటీ గా ఉండి ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ లో పెద్దగా డైలాగ్స్ కూడా లేకుండా ఓ కోడి శబ్ధంతో, అలాగే దాని చుట్టూ ఉన్న సౌండ్స్‌ తోనే ట్రైలర్ మొత్తం సాగుతుంది. సినిమా కూడా ఆ కోడి నేపథ్యంలోనే తెరకెక్క్కినట్టు తెలుస్తుంది.

- Advertisement -

కొత్త రకం వెరైటీగా కోట్టుక్కలి..

ఇక కోట్టుక్కలి (Kottukkali) సినిమాకి సంబంధించి ట్రైలర్ లో అయితే మ్యూజిక్‌కి సంబంధించి ఎలాంటి సౌండ్ లేకపోవడం విశేషం. దీనికి కారణం ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ లేడని సమాచారం. ఇలాంటి వెరైటీ ప్రయత్నం మూవీ లవర్స్ ని ఆకట్టుకుంటుంది. సాధారణంగా డాక్యూమెంటరీ వీడియోలకు పెద్దగా మ్యూజిక్ వాడారు. కానీ ఈ సినిమాలో పూర్తిగా మ్యూజిక్ డైరెక్టర్ తో పనిలేకుండా సినిమా తీసారని సమాచారం. ఇక నటుడు సూరి హీరోగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ లో కూడా మ్యూజిక్ డైరెక్టర్ పేరు లేదు. ఇక కోట్టుక్కలి సినిమాను పీఎస్ వినోద్ రాజ్ డైరెక్ట్ చేయగా ఆగస్టు 23న రిలీజ్ తమిళ్ లో రిలీజ్ అవుతుంది. అయితే తమిళ్ లో రెస్పాన్స్ ని బట్టి ,తెలుగులో రిలీజ్ గురించి ప్లాన్ చేస్తారని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు