Krishna bhagavan: ఇండస్ట్రీలో తొక్కేయడానికి కారణం ఎవరంటే..?

Krishna bhagavan.. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో నటీనటులు కెరియర్ బాగున్నప్పుడే కథలు ఎంపిక విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ చిన్నపాటి తడబాటు జరిగినా సరే ఒక ఫ్లాప్ ఏర్పడిందంటే తర్వాత సినిమాలలో తీసుకోవడానికి దర్శక నిర్మాతలు వెనుకడుగు వేస్తారు. అందులో భాగంగానే చాలామంది సెలబ్రిటీలు కెరియర్ పీక్స్ లో ఉండగానే సినిమా ఎంపికల విషయంపై అజాగ్రత్తపడి కెరియర్ నాశనం చేసుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దిగ్గజ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ భగవాన్ కూడా ఒకరు అని చెప్పవచ్చు.

Krishna bhagavan: Who is the reason for trampling in the industry..?
Krishna bhagavan: Who is the reason for trampling in the industry..?

కామెడీకి కేరాఫ్ అడ్రస్ కృష్ణ భగవాన్..

కెరియర్ పీక్స్ లో ఉండగానే అర్ధాంతరంగా ఇండస్ట్రీకి దూరమైన కృష్ణ భగవాన్.. ప్రస్తుతం జబర్దస్త్ వంటి కామెడీ షో లలో జడ్జిగా వ్యవహరిస్తూ అందరిని అలరిస్తున్నారు . ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన కెరియర్ ఇలా ఉన్నట్టుండి ఆగిపోవడానికి గల కారణాలను కూడా వెల్లడించారు. హాస్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కృష్ణ భగవాన్ చాలామంది స్టార్ హీరోల సినిమాలలో తనదైన పంచ్ డైలాగులతో నటించి మెప్పించారు. నటుడిగా మూడు దశాబ్దాల ప్రయాణం ఆయనది. ఎంతమంది హీరోలతో కలిసి పని చేశారు. ముఖ్యంగా కృష్ణ భగవాన్ కామెడీ మాత్రమే ఏ సినిమాలో అయినా సరే హైలెట్ అయ్యారు. తెలుగు సినిమాలలో తన దైన ముద్ర వేసుకున్నారు కృష్ణ భగవాన్.

ఆ రోజును నేనెప్పటికీ మర్చిపోలేను..

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణ భగవాన్ కెరియర్ జర్నీ గురించి సినిమాల్లో అవకాశాలు తగ్గడం పై స్పందించారు. కృష్ణ భగవాన్ మాట్లాడుతూ.. కాలేజీ రోజుల్లో నేను నాటకాలు వేసేవాడిని. మిమిక్రీ కూడా చేసేవాడిని. అదే నన్ను వంశీ వరకు తీసుకెళ్లింది. వంశీ తో నా సాన్నిహిత్యం మహర్షి సినిమా నుంచి మొదలయ్యింది. వెటకారం అనేది గోదావరి నీళ్లలోనే ఉంది అందువల్లే అది నాకు వచ్చింది. సినిమాల పరంగా నాకు చాలా హెల్ప్ అయ్యింది కూడా. మొదటి రోజు నుంచి నేను సరదా మనిషిని. సినిమాల్లోకి రాకముందే ఏదైనా పనిపై బయటకు వెళ్లి వచ్చినప్పుడు రామానాయుడు గారు ఫోన్ చేశారా? రాఘవేందర్ రావు గారు ఫోన్ చేశారా ?అని మా ఇంట్లో వాళ్ళని అడిగే వాడిని.. హా.. రామోజీరావు గారు ఫోన్ చేసేవారు అనేవారు. నిజంగానే నాకోసం రామానాయుడు గారు ఫోన్ చేశారు.. ఆ రోజున ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. సరదాగా ఈ విషయాన్ని ఆయనతో చెప్పాను కూడా..

- Advertisement -

అది లేకపోవడం వల్ల అవకాశాలు తగ్గిపోయాయి..

నాకు పెద్దగా లౌక్యం తెలియదు.. ఆశించన స్థాయిలో అవకాశాలు రాకపోవడానికి కూడా కారణం అదే అని నేను అనుకుంటున్నాను. హీరోల్లో అల్లరి నరేష్ తో నేను ఎక్కువ చనువుగా ఉంటాను. నటుడుగా ఈరోజు ఈ స్థాయి గుర్తింపుని సంపాదించుకోవడం పట్ల నేను పూర్తి సంతృప్తితో ఉన్నాను అంటూ కృష్ణ భగవాన్ తెలిపారు. మొత్తానికి అయితే ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవడానికి కారణాలు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు కృష్ణ భగవాన్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు